165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
- Redmi K100 స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 27న చైనాలో లాంచ్
- ఇందులో 6.83 అంగుళాల 165Hz డిస్ప్లే
- 40కి పైగా గేమ్స్‌లో 165fps మోడ్‌కు సపోర్ట్
- Snapdragon 8 Elite చిప్సెట్తో పాటు ప్రత్యేక D2 గేమింగ్ గ్రాఫిక్స్ చిప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redmi K100 Launch Date: షావోమీ రెడ్మీ K100 స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ 27న చైనాలో అధికారికంగా విడుదల చేయనుంది. ఇప్పటికే రెడ్మీ K100 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లను ఆగస్టులో పరిచయం చేసిన సంస్థ.. తాజాగా స్టాండర్డ్ K100కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించింది. కొత్త ‘ఫ్లేమ్ గ్రీన్’ కలర్లో మెటల్ ఫ్రేమ్, ‘Sound by Bose’ బ్రాండింగ్‌తో ఈ ఫోన్ కనిపించనుంది. రెడ్మీ K100లో 6.83 అంగుళాల డిస్ప్లేను అందించారు. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. 40కి పైగా మొబైల్ గేమ్స్‌లో 165fps మోడ్‌కు ఫోన్ సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. 480Hz మల్టీ-ఫింగర్ టచ్ రిపోర్టింగ్ రేట్, 3500Hz ఇన్స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, గరిష్ఠంగా 3500 నిట్స్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
పనితీరు విషయానికి వస్తే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్తో పాటు ప్రత్యేక D2 గేమింగ్ గ్రాఫిక్స్ చిప్‌ను ఇందులో అందించారు. ఈ డ్యూయల్ చిప్ సెటప్ ఫ్రేమ్రేట్ను స్థిరంగా ఉంచడంతో పాటు వేడిని, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని షావోమీ తెలిపింది. ‘హానర్ ఆఫ్ కింగ్స్’ గేమ్‌లో 144fpsను కొనసాగిస్తూ సగటు పవర్ వినియోగాన్ని 1.1W తగ్గించినట్లు పేర్కొంది. సాఫ్ట్వేర్ పరంగా ఇందులో హైపర్ఓఎస్ 4 అందించనున్నారు. రియల్‌టైమ్ అవసరాలకు అనుగుణంగా రిసోర్స్ కేటాయింపు, తరచుగా ఉపయోగించే యాప్స్ కోసం ప్రిడిక్టివ్ మెమరీ ప్రీలోడింగ్, సిస్టమ్ యాప్స్ ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్లతో పనితీరును మెరుగుపరచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ధర, వేరియంట్లు, ఇతర వివరాలను అక్టోబర్ 27న వెల్లడించనుంది.
Also Read
- Redmi Pad 3 లాంచ్‌కు ముందు స్పెసిఫికేషన్లు లీక్.. 10,000mAh బ్యాటరీతో రాక!
- New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
- WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
- 108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
తాజావార్తలు
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..
-
Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
-
Sajjala Ramakrishna Reddy : స్థానిక పోరుపై కూటమికి సజ్జల సవాల్
-
Uppal Flyover : 8 ఏళ్లుగా ఎదురుచూపులే.. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తి.?
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!