Redmi A7, A7 Pro Launched: షియోమీ (Xiaomi) భారత్ లో కొత్తగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు REDMI A7 అండ్ REDMI A7 Pro సామ్రాట్ ఫోన్స్ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మధ్యే వచ్చిన A7 Pro 5G తర్వాత.. ఇప్పుడు వాటిని 4G సెగ్మెంట్‌లో ఈ రెండు ఫోన్లను తీసుకువచ్చింది. పెద్ద బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, కొత్త HyperOSతో ఈ ఫోన్లు వినియోగదారులకు బడ్జెట్ ధరలో ఆకర్షించేలా ఉన్నాయి.
డిస్‌ప్లే & డిజైన్:
REDMI A7లో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉండగా, A7 Proలో 6.9 అంగుళాల పెద్ద స్క్రీన్ అందించారు. రెండింటిలోనూ 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్మూత్ అనుభవం లభిస్తుంది. A7లో 600 నిట్స్, A7 Proలో 800 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఉంటుంది. వెట్ టచ్ టెక్నాలజీ 2.0 వల్ల తడి చేతులతో కూడా సులభంగా ఉపయోగించవచ్చు. TÜV Rheinland సర్టిఫికేషన్‌తో కళ్లకు హాని తగ్గించే ఫీచర్లు ఉన్నాయి. డిజైన్ పరంగా ఈ ఫోన్లు స్లిమ్‌గా 8.26mm మందంతో వస్తాయి. REDMI A7 బ్లాక్, స్కై బ్లూ రంగుల్లో అందుబాటులో ఉండగా.. A7 Pro బ్లాక్, ఆరెంజ్ కలర్స్‌లో లభిస్తుంది.
AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
పర్ఫార్మెన్స్ & బ్యాటరీ:
ఈ ఫోన్లకు UNISOC T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్ పవర్ ఇస్తుంది. 4GB వరకు ర్యామ్, అదనంగా 4GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ లభిస్తుంది. స్టోరేజ్‌ను microSD ద్వారా 2TB వరకు పెంచుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే REDMI A7లో 5200mAh బ్యాటరీ ఉండగా, A7 Proలో 6300mAh భారీ బ్యాటరీ అందించారు. 1000 చార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా 80% సామర్థ్యం నిలుస్తుందని కంపెనీ చెబుతోంది. 15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వీటికి లభిస్తుంది.
సాఫ్ట్‌వేర్ & AI ఫీచర్లు:
REDMI A7లో Android 15 ఆధారిత HyperOS 2 ఉండగా, A7 Proలో తాజా HyperOS 3 అందించారు. ఇందులో గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్ వంటి AI ఫీచర్లు ఉన్నాయి. Xiaomi హైపర్ ఐలాండ్, ఇంటర్‌కనెక్టివిటీ ఫీచర్లతో మల్టీటాస్కింగ్ సులభమవుతుంది.
కెమెరా ఫీచర్లు:
ఈ సిరీస్‌లో 13MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. HDR+, నైట్ మోడ్ సపోర్ట్ వీటికి ఉన్నాయి. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. AI స్కై, డాక్యుమెంట్ మోడ్ వంటి సాఫ్ట్‌వేర్ టూల్స్ తో ఫోటోలు ఎడిట్ చేయడం సులభం.
ఇతర ఫీచర్లు:
సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, FM రేడియో, IP52 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు వీటికి ఉన్నాయి. Wi-Fi, బ్లూటూత్ 5.2, USB Type-C కనెక్టివిటీ కూడా అందించారు.
Genelia D’Souza: స్టేజి పైనే వెక్కి వెక్కి ఏడ్చిన హా.. హా.. హాసిని.! వీడియో వైరల్..
ధర:
REDMI A7 మొబైల్ 3GB+64GB వేరియంట్ ధర రూ.10,999గా నిర్ణయించారు. REDMI A7 Pro 4GB+64GB ధర రూ.11,499గా ఉంది (లిమిటెడ్ పీరియడ్ ఆఫర్). ఈ ఫోన్లు ఏప్రిల్ 24 నుంచి mi.com, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభ్యమవుతాయి.
