Genelia D’Souza: స్టేజి పైనే వెక్కి వెక్కి ఏడ్చిన హా.. హా.. హాసిని.! వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Genelia D’Souza: ఇదివరకు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన జెనీలియా (Genelia D’Souza) ముంబైలో జరిగిన ‘రాజా శివాజీ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తీవ్ర భావోద్వేగానికి లోనై స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భర్త, నటుడు రితేష్ విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ (Riteish Deshmukh)కు సినిమా నిర్మాణంలో ఎదురైన కష్టాలను వివరించగా, ఆ మాటలు విని జెనీలియా వెక్కివెక్కి ఏడ్చారు.
200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్‌లోనే POCO M8s 5G లాంచ్.!
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఈ కార్యక్రమంలో రితేష్ తన టీమ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. తన విజన్‌కు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ సమయంలో పక్కనే నిలబడ్డ జెనీలియా అతని మాటలకు తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఒక దశలో రితేష్ ఆమెను “తనకు అతిపెద్ద బలం”గా అభివర్ణించడంతో ఆ మాటతో మరింత ఏడ్చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘రాజా శివాజీ’ చిత్రంలో అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్, మహేష్ మంజ్రేకర్, భాగ్యశ్రీ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే సచిన్ ఖేడేకర్, ఫర్దీన్ ఖాన్, జితేంద్ర జోషి, అమోల్ గుప్తలు కూడా ఈ సినిమాలో నటించారు. అంతేకాదు జెనీలియా కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. ఇంకా ప్రత్యేకంగా సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో కామియో పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు గానీ, కథలో కీలక పాత్ర పోషిస్తారని రితేష్ అన్నారు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్ సన్నివేశాలు, చారిత్రక నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మే 1న మహారాష్ట్ర డే సందర్భంగా విడుదల కానుంది.
Digital Vastu Tips: ఈ మూడు మీ మొబైల్ ఫోన్ నుంచి తొలగించండి.. అదృష్టం మారిపోతుంది..!
ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, ముంబై ఫిలిం కంపెనీ నిర్మిస్తుండగా.. జ్యోతి దేశ్‌పాండే, జెనీలియా దేశ్‌ముఖ్ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
" आज जो भी में हूं , सिर्फ तुम्हारी वजह से हूं, तुम ना होती तो में यहां नहीं होता , मेरी सफलता तुम ही हो ",
बॉलीवुड की सबसे बेहतरीन पति पत्नी की जोड़ी रितेश देशमुख और जेनेलिया डिसूजा की है , आज रितेश देशमुख ने ऐसा काम किया जिसके बाद उनकी पत्नी जेनेलिया डिसूजा मंच पर जोर जोर से… pic.twitter.com/euYqdJQ8Q5
— Nargis Bano (@Nargis_Bano78) April 20, 2026
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!