7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
REDMI 17 and REDMI 17 5G Launched: షావోమీ (Xiaomi) తన నంబర్ సిరీస్‌లో కొత్తగా REDMI 17 & REDMI 17 5G స్మార్ట్ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మధ్యనే భారత్‌లో REDMI Note 17ను విడుదల చేసిన కంపెనీ.. ఇప్పుడు ఈ రెండు మోడళ్లను కూడా అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. భారీ 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP AI కెమెరా, ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3 వంటి ఫీచర్లతో ఈ ఫోన్లు వచ్చాయి.
REDMI 17, REDMI 17 5G రెండింటిలోనూ 6.9 అంగుళాల HD+ LCD డిస్ప్లేను అందించారు. ఇది 120Hz AdaptiveSync రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, గరిష్టంగా 825 నిట్స్ బ్రైట్నెస్ ను అందిస్తుంది. స్క్రీన్కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ ఉండగా, IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా లభిస్తుంది. అలాగే ట్రిపుల్ TÜV Rheinland సర్టిఫికేషన్, DC డిమ్మింగ్, వెట్ టచ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో డైనమిక్ RGB లైట్ అందించారు. కాల్స్, ఛార్జింగ్, గేమింగ్, యాప్ నోటిఫికేషన్ల సమయంలో ఇది ప్రత్యేక లైటింగ్ ఎఫెక్ట్స్‌ను చూపిస్తుంది.
Also Read
- Lenovo ThinkBook 14x: లెనోవా ThinkBook 14x వచ్చేసింది.. 120Hz OLED డిస్ప్లే, Core Ultra ప్రాసెసర్
- Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
REDMI 17లో MediaTek Helio G91 Ultra ప్రాసెసర్ ఉండగా, REDMI 17 5Gలో Qualcomm Snapdragon 4 Gen 5 (4nm) చిప్‌సెట్‌ను అందించారు. రెండు ఫోన్లలో 4GB/6GB LPDDR4X RAM, మెమరీ ఎక్స్‌టెన్షన్‌తో కలిపి 12GB వరకు RAM, 128GB/256GB UFS 2.2 స్టోరేజ్ లభిస్తుంది. అలాగే microSD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్ విస్తరించుకోవచ్చు. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత Xiaomi HyperOS 3పై పనిచేస్తాయి.
ఫోటోగ్రఫీ కోసం 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. డ్యూయల్-వ్యూ వీడియో రికార్డింగ్ ఫీచర్ ద్వారా ముందు, వెనుక కెమెరాలతో ఒకేసారి వీడియోలు రికార్డ్ చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ రెండు ఫోన్లలో 7500mAh భారీ బ్యాటరీ ఉంది. దీనికి 45W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. కంపెనీ ప్రకారం.. ఫోన్ 96 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అలాగే 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీనితో ఇతర డివైస్‌లను కూడా ఈ ఫోన్‌తో ఛార్జ్ చేయవచ్చు.

ఇతర ఫీచర్లలో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు (300% వాల్యూమ్ బూస్ట్), సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, Wi-Fi 6, USB Type-C పోర్ట్, బ్లూటూత్ 5.1 (REDMI 17 5G), బ్లూటూత్ 5.4 (REDMI 17)లు ఉన్నాయి. ఇక REDMI 17 ప్రారంభ ధర USD 179 (రూ. 17,040)గా నిర్ణయించారు. ఇది బ్లాక్, డీప్ బ్లూ, ఓక్ గ్రీన్, లోటస్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. మరోవైపు REDMI 17 5G ప్రారంభ ధర USD 249 (రూ. 23,710)గా ఉంది. ఇది బ్లాక్, డీప్ బ్లూ, వివిడ్ ఆరంజ్ (PU లెథర్ ఫినిష్) రంగుల్లో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా 4GB + 256GB, 6GB + 128GB, 6GB + 256GB వేరియంట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్లు గ్లోబల్ మార్కెట్‌కు ప్రకటించగా.. త్వరలోనే భారత్‌లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
-
Lenovo ThinkBook 14x: లెనోవా ThinkBook 14x వచ్చేసింది.. 120Hz OLED డిస్ప్లే, Core Ultra ప్రాసెసర్
-
Hanuma Vihari : ఆడకున్నా అవకాశాలు ఇస్తారా, ఇంకెంతకాలం జట్టులో ఉంటాడు.. హనుమ విహారి కీలక వ్యాఖ్యలు!
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!