Site icon NTV Telugu

6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో బడ్జెట్ సెగ్మెంట్‌లో Redmi 15C 5G లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!

Redmi 15c 5g

Redmi 15c 5g

Redmi 15C 5G: షియోమీ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 15C 5G (Redmi 15C 5G)ని ప్రపంచ మార్కెట్లలో కొన్ని దేశాలలో మాత్రమే విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 6,000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది ధూళి, నీటి నిరోధకత కోసం IP64 రేటింగ్, భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఈ నెల ప్రారంభంలోనే కొన్ని యూరోపియన్ దేశాలలో కంపెనీ ఈ ఫోన్ సంబంధించి 4G వేరియంట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

The last Solar Eclipse : ఈ ఏడాదిలో నేడు కనిపించనున్న చివరి సూర్య గ్రహణం..

పోలాండ్‌లో రెడ్‌మీ 15C 5G PLN 799 (రూ. 19,500)గా ఉంది. అయితే, ప్రస్తుతం 4GB + 256GB వేరియంట్ PLN 699 (రూ. 17,000)కు లభిస్తోంది. ఈ ఫోన్ డస్క్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు లభిస్తుంది. రెడ్‌మీ 15C 5G 6.9 అంగుళాల డాట్ డ్రాప్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 1600 × 720 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz వరకు, టచ్ శాంప్లింగ్ రేట్ 240Hz వరకు ఉంటుంది. దీనికి TÜV Rheinland సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. అదనపు ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో రీడింగ్ మోడ్, DC డిమ్మింగ్, 1200:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.

ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్ C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. ఇది ధూళి, నీటి నుండి రక్షణ కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. భద్రత కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫోన్ 211 గ్రాముల బరువు ఉండగా.. దీని కొలతలు 173.16×81.07×8.2 mm గా ఉన్నాయి.

Journalist Zhang Zhan: పాపం మహిళా జర్నలిస్ట్‌పై చైనా కన్నెర్ర.. కరోనా గురించి చెప్పడమే శాపం అయ్యింది!

రెడ్‌మీ 15C 5Gలో ఆక్టా-కోర్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoCని ఇచ్చారు. ఇది 4GB LPDDR4X ర్యామ్, 256GB వరకు eMMC 5.1 స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్‌OS 2తో వస్తుంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో f/1.8 అపెర్చర్‌తో 50MP AI బ్యాక్డ్ మెయిన్ సెన్సార్, దానితో పాటు ఒక సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం f/2.0 అపెర్చర్‌తో 8MP సెన్సార్ ఉంది.

Exit mobile version