చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘షావోమీ’ భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 15సీ (Redmi 15C 5G Launch)ని విడుదల చేస్తోంది. షావోమీ కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ లాంచ్ వివరాలను ధృవీకరించింది. అంతేకాదు అనేక కీలక ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఫోన్ కోసం ఒక మైక్రోసైట్ ఉంది. 6000mAh బ్యాటరీ, 50MP వెనుక కెమెరాను కలిగి ఉంటుంది. రెడ్‌మీ 15సీ MediaTek చిప్‌సెట్ ద్వారా పని చేస్తుంది.
Also Read: 2025 December Movies: డిసెంబర్‌లో సినిమాలే సినిమాలు.. ఆ లోటును బాలయ్య పూడుస్తారా?
రెడ్‌మీ 15సీ స్మార్ట్‌ఫోన్ మూడు రంగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది: డస్క్ పర్పుల్, మూన్‌లైట్ బ్లూ సహా మిడ్‌నైట్ బ్లాక్ రంగులో రానుంది. అమెజాన్ ఇండియాలో ఉన్న డీటైల్స్ ప్రకారం.. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది, ఇది మంచి గేమింగ్ అనుభవాన్ని ఇస్తుంది. MediaTek Dimensity 6300 చిప్‌సెట్, Xiaomi Hyper OS 2తో రానుంది. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది ఈ హ్యాండ్ సెట్ 6000mAh బ్యాటరీతో వస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.12,000గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫుల్ డీటెయిల్స్ మరికొన్ని గంటల్లో తెలియరానున్నాయి.
