120Hz డిస్ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!
- షియోమీ కొత్తగా REDMI 15A 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్
- బడ్జెట్ సెగ్మెంట్లో ఆకర్షణీయమైన ఫీచర్లతో విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
REDMI 15A 5G Launched: షియోమీ (Xiaomi) సంస్థ భారత మార్కెట్లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ రెడ్ మీ 15A 5Gను లాంచ్ చేసింది. బడ్జెట్ సెగ్మెంట్ లో పోటీని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్ ను మంచి ఫీచర్లతో తీసుకొచ్చింది. ముఖ్యంగా పెద్ద డిస్ప్లే, దీర్ఘకాల బ్యాటరీ, లాంగ్ టర్మ్ సాఫ్ట్ వేర్ సపోర్ట్ ఈ ఫోన్ ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. మరి ఆ విశేషాలేంటో చూద్దామా..
డిస్ప్లే & డిజైన్:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.9 అంగుళాల HD+ డిస్ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ విజువల్స్ అందిస్తుంది. TÜV Rheinland సర్టిఫికేషన్లు ఉండటం వల్ల కళ్లకు రక్షణ కల్పిస్తుంది. ఇది గరిష్టంగా 810 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అవుట్‌డోర్‌లో కూడా క్లియర్‌గా కనిపిస్తుంది.
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
MLA Arava Sridhar controversy: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ఎదుట ఆత్మహ*త్య చేసుకుంటా..!
సాఫ్ట్వేర్:
రెడ్ మీ 15A 5Gలో Unisoc T8300 ప్రాసెసర్ ను ఉపయోగించారు. 4GB & 6GB ర్యామ్ వేరియంట్లతో పాటు, వర్చువల్ ర్యామ్ ద్వారా అదనంగా 6GB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Xiaomi HyperOS 3.0పై పనిచేస్తుంది. కంపెనీ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని హామీ ఇచ్చింది.
కెమెరా ఫీచర్లు:
ఈ ఫోన్లో 32MP ప్రధాన కెమెరా ఉంది. దీనితో పాటు సెకండరీ కెమెరా కూడా అందించారు. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ:
ఈ కొత్త 5G మొబైల్ లో 6300mAh భారీ బ్యాటరీ ఉంది. దీనితో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు బాక్స్‌లోనే ఛార్జర్ అందిస్తున్నారు. అలాగే 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. 1000 ఛార్జింగ్ సైకిల్స్ తర్వాత కూడా 80% బ్యాటరీ హెల్త్ ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటితోపాటు ఈ మొబైల్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, FM రేడియో, IP52 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్, మైక్రోSD ద్వారా 1TB వరకు స్టోరేజ్ విస్తరణ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి.
Grameen Credit Score: సిబిల్ స్థానంలో ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’.. బ్యాంకులకు కేంద్రం కీలక ఆదేశాలు..
ధర:
ఈ ఫోన్ ఆసమ్ బ్లూ, అమజ్ పర్పుల్, ఏస్ బ్లాక్ వంటి మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ధరలు చూస్తే..
* 4GB + 64GB: రూ. 12,999
* 4GB + 128GB: రూ. 14,499
* 6GB + 128GB: రూ. 16,499 గా నిర్ణయించారు. ఈ ఫోన్ ఏప్రిల్ 3 నుంచి ఫ్లిప్ కార్ట్, Mi.com అండ్ ఆఫ్ లైన్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభమవుతాయి.
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?