Redmi 13R 5G Launch : రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది.. రెడ్‌మి 13ఆర్ 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ 5జీ ఫోన్ చైనాలో నిశ్శబ్దంగా లాంచ్ అయింది.. ఇటీవల భారత మార్కెట్ లో లాంచ్ అయిన రెడ్‌మి 13సీ 5జీతో ఫోన్ స్పెసిఫికేషన్‌లను షేర్ చేసింది.. 5జీ కనెక్టివిటీతో కూడిన బడ్జెట్ ఆఫర్, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. రెడ్‌మి 13సీ 5జీ మోడల్ మాదిరిగానే కొత్త ఫోన్ కూడా 6.74-అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ ప్యానెల్, 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది..
ఫీచర్స్, స్పెసిఫికేషన్లు..
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
ఈ ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల హెచ్‌డీప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ, 4జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ యూఎఫ్ఎస్ 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీ ద్వారా ఫోన్ పవర్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఎంఐయూఐ 14తో వస్తుంది.. ఇక కెమెరా విషయానికొస్తే.. సెల్ఫీ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, బ్యాక్ సైడ్ సెకండరీ కెమెరా ఉన్నాయి. డిస్‌ప్లే ఎగువన కేంద్రీకృత వాటర్‌డ్రాప్ నాచ్‌లో 5ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను అందిస్తుంది.
షావోమీ రెడ్‌మి 13ఆర్ 5జీలో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది… ఈ ఫోన్ బరువు 192 గ్రాములు, 168ఎమ్ఎమ్x78ఎమ్ఎమ్ x 8.09ఎమ్ఎమ్ పరిమాణం ఉంటుంది. ఇంకా బోలెడు ఫీచర్స్ ఉన్నాయి.. ఇక ధర విషయానికొస్తే.. 4జీబీ + 128జీబీ వేరియంట్ స్టార్ రాక్ బ్లాక్, ఫాంటసీ పర్పుల్, వేవ్ వాటర్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. చైనాలో సీఎన్‌వై 999 (దాదాపు రూ. 11,700) వద్ద ఉంటుందని అంచనా..
తాజావార్తలు
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి