Site icon NTV Telugu

Realme నుండి మరో సంచలనం.. కొత్త P-సిరీస్ 5G ఫోన్ టీజర్..! “Most Wanted X” రహస్యం ఏంటో?

Realme

Realme

Realme Most Wanted X: రియల్‌మీ (Realme) స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త. ఇండియన్ మార్కెట్‌లో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన రియల్‌మీ, ఇప్పుడు తన P-సిరీస్ 5G శ్రేణిలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక టీజర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా లైవ్ అయింది. రియల్‌మీ ఈ అప్‌కమింగ్ ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా ఒక మైక్రోసైట్ ఏర్పాటు చేశారు. ఈ పేజీలో ఎటువంటి వివరాలు ఇవ్వనప్పటికీ, ఒక పెద్ద ‘X’ గుర్తు, “India’s most wanted X. Guess what’s next?” అనే ట్యాగ్‌లైన్ ఆసక్తిని పెంచుతుంది. గతంలో P3 సిరీస్‌లో Realme P3X లాంచ్ అయినందున, ఈ ‘X’ కోడ్‌ను బట్టి రాబోయే మోడల్ Realme P4X 5G అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే రియల్‌మీ GT8 సిరీస్‌తో పాటు కొత్త P-సిరీస్ ఫోన్లు లాంచ్ చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇది P5 5G లేదా P5 Pro అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.

Fitness Exercises: గ్రామాల్లో చేసే పనులతో.. జిమ్ లో మహిళలకు ట్రైనింగ్

ఈ కొత్త P-సిరీస్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్లపై ఇప్పటికే పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఇందులో Realme P3X లో Dimensity 6400 SoC వాడినందున.. దీని కంటే మెరుగైన చిప్‌సెట్‌తో రావచ్చు. ప్రముఖ టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం.. RMX5108 అనే మోడల్ నంబర్ గల రియల్‌మీ ఫోన్ గీక్‌బెంచ్ (Geekbench) డేటాబేస్‌లో కనిపించింది. ఇది MediaTek Dimensity 7400 SoC తో పాటు 8GB ర్యామ్, ఆండ్రాయిడ్ 15 తో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

GlobeTrotter : ‘వారణాసి’ ఈవెంట్ ఎఫెక్ట్.. ఎస్ఎస్ రాజమౌళి పై పోలీసులకు ఫిర్యాదు

టీజర్‌లో సూచించినట్లుగా ఈ కొత్త ఫోన్ గేమింగ్ ఆప్టిమైజ్డ్, మరింత శక్తివంతమైన AI సామర్థ్యం గల చిప్‌సెట్‌తో రావచ్చు. P3x లో 6.72-అంగుళాల FHD+ 120Hz LCD డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ (45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో), 50MP కెమెరా ఉన్నాయి. P4X/కొత్త P-సిరీస్ ఫోన్‌లో ఈ ఫీచర్లలో మరింత అప్‌గ్రేడ్ ఉండవచ్చు. ప్రస్తుతానికి పేరు, లాంచ్ తేదీ వంటి కీలక వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో టీజింగ్ ప్రారంభం కావడంతో.. రాబోయే రోజుల్లో రియల్‌మీ ఈ కొత్త “మోస్ట్ వాంటెడ్ X” స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ కొత్త రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ కోసం రాబోయే అప్‌డేట్‌ల కోసం వేచి NTV టెక్నాలజీ పేజీని గమనిస్తూ ఉండండి.

Exit mobile version