Site icon NTV Telugu

2.8K డిస్‌ప్లే, Dimensity 7300 Max, 12,200mAh బ్యాటరీతో Realme Pad 3 భారత్‌లో లాంచ్‌..!

Realme Pad 3

Realme Pad 3

Realme Pad 3: రియల్‌మీ సంస్థ Realme 16 Pro సిరీస్‌తో పాటు రియల్‌మీ తన కొత్త ట్యాబ్లెట్ రియల్‌మీ ప్యాడ్ 3 (realme Pad 3)ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. పెద్ద డిస్‌ప్లే, మంచి ప్రాసెసర్, భారీ బ్యాటరీతో ఈ ట్యాబ్లెట్ స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ వినియోగదారులను ఆకట్టుకునేలా దీనిని రూపొందించారు.

రియల్‌మీ ప్యాడ్ 3లో 11.61 అంగుళాల 2.8K (2800 x 2000) LCD డిస్‌ప్లేను అందించారు. 7:5 యాస్పెక్ట్ రేషియోతో వచ్చిన ఈ స్క్రీన్ చదువు, మల్టీటాస్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. 60Hz / 90Hz / 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 550 నిట్స్ బ్రైట్‌నెస్, లో బ్లూ లైట్ సర్టిఫికేషన్లతో కళ్లకు తక్కువ ఒత్తిడి కలిగిస్తుంది. ఈ ట్యాబ్లెట్‌లో 4nm టెక్నాలజీపై ఆధారిత MediaTek Dimensity 7300 Max ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అలాగే Mali-G615 MC2 GPUతో గేమింగ్, హెవీ యాప్స్ వినియోగంలో స్మూత్ పనితీరు అందిస్తుంది.

55dB ANC, డ్యూయల్ డ్రైవర్స్, AI ట్రాన్స్‌లేషన్ ఫీచర్లతో కొత్త Realme Buds Air 8 లాంచ్‌..!

ఇందులో 8GB ర్యామ్ తో పాటు 128GB / 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. మైక్రోSD కార్డ్ ద్వారా 2TB వరకు మెమరీ సపోర్ట్ చేస్తుంది. ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత realme UI 7.0పై పనిచేస్తుంది. క్లిన్ ఇంటర్‌ఫేస్‌తో పాటు ప్రొడక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్‌లో 8MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే ఇది 6.6mm స్లిమ్ బాడీతో ప్రీమియం లుక్ కలిగి ఉంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది.

ఇందులో ఆడియో, కనెక్టివిటీ పరంగా మెరుగైన ఫీచర్లను అందించారు. ఇందులో క్వాడ్ స్పీకర్స్ ఉండటంతో పవర్‌ఫుల్ సౌండ్ అనుభవం లభిస్తుంది. USB టైపు-C ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల ఆధునిక యాక్సెసరీస్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఎంపిక చేసిన వేరియంట్లలో 5G కనెక్టివిటీ అందించగా, Wi-Fi ac (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.4 వంటి ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

Tax Free On Salary: మీరు సంపాదించే జీతంపై ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సి అవసరం లేని దేశాలు ఏవో తెలుసా..?

ఈ ట్యాబ్లెట్‌లో భారీగా 12,200mAh సామర్థ్యం కలిగిన స్లిమ్ టైటాన్ బ్యాటరీని అందించారు. ఇది దీర్ఘకాలం వినియోగానికి అనుకూలంగా ఉండటమే కాకుండా, 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. అదనంగా 6.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఇతర డివైసులను కూడా ఛార్జ్ చేసుకునే వీలుంది. ఇది పలు వేరియంట్లలో లభిస్తుంది. 8GB RAM + 128GB స్టోరేజ్ ఉన్న Wi-Fi వేరియంట్ ధర MOP ₹26,999 కాగా, బ్యాంక్ లేదా UPI డిస్కౌంట్‌తో పాటు నో-కాస్ట్ EMI ఆఫర్ల తర్వాత దీన్ని రూ. 24,999కే కొనుగోలు చేయవచ్చు. అలాగే 8GB + 128GB 5G వేరియంట్ 29,999 కాగా, ఆఫర్ ధర 27,999గా ఉంది. అలాగే 8GB + 256GB 5G వేరియంట్ 31,999 కాగా, ఆఫర్ లో 29,999గా నిర్ణయించారు. realme Pad 3 ట్యాబ్లెట్ జనవరి 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్, రియల్‌మీ ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది.

Exit mobile version