8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
- రియల్మీ పీ4ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 26న భారత మార్కెట్లో లాంచ్..
- గ్రీన్, బ్రౌన్ బేజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి..
- 8,000mah భారీ బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme P4s 5G: రియల్మీ (Realme) నుండి కొత్త P4s 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. P4 సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ ఫోన్‌ను ఆగస్టు 26న భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో Realme P4, P4 Lite, P4x, P4 Pro 5G మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా వీటికి P4s 5G జతకానుంది. Realme P4s 5Gను ఆగస్టు 26న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. గ్రీన్, బ్రౌన్ బేజ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానున్నట్లు టీజర్ ద్వారా వెల్లడైంది. ధరను మాత్రం కంపెనీ ఇంకా ప్రకటించలేదు. లాంచ్ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌ను రియల్మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఈ Realme P4s 5Gలో శాంసంగ్ M14 డిస్ప్లేను అందిస్తున్నారు. ఇది 1,272 × 2,772 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. స్క్రీన్ గరిష్టంగా 6,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే HDR10+తో పాటు నెట్ఫ్లిక్ HDR కంటెంట్‌కు కూడా ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. ముందటి డిస్ప్లేలతో పోలిస్తే 26% మెరుగైన ల్యూమినస్ ఎఫిషియెన్సీ, 50% ఎక్కువ స్క్రీన్ లైఫ్‌ను అందిస్తుందని రియల్మీ తెలిపింది.
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్లో MediaTek Dimensity 7400 Ultra 5G చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్, గేమింగ్ వంటి పనితీరు ఆధారిత టాస్క్‌ల కోసం ప్రత్యేకంగా HyperVision+ AI చిప్ కూడా ఇందులో ఉంటుంది. దీంతో రోజువారీ పనులతో పాటు గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి అవసరాలకు మెరుగైన పనితీరును అందించే అవకాశం ఉంది. ఇక కెమెరాల విషయానికి వస్తే 50MP డ్యూయల్ AI కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరాకు OIS సపోర్ట్ అందించారు. దీంతో ఫోటోలు, వీడియోలు తీసేటప్పుడు కెమెరా షేక్‌ను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

ఈ ఫోన్లో ప్రధానంగా 8,000mAh భారీ బ్యాటరీను చెప్పుకోవచ్చు. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు వినియోగాన్ని అందించగలదని కంపెనీ చెబుతోంది. డ్యామేజ్ నుంచి రక్షణ కోసం IP66+IP68+IP69 రేటింగ్స్ అందించారు. అంటే దుమ్ము, నీరు వంటి వాటి నుంచి ఫోన్‌కు మెరుగైన రక్షణ లభించనుంది. లీకుల ప్రకారం ఈ మొబైల్ నాలుగు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో తీసుకురావచ్చని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?