Realme తన తాజా P-series స్మార్ట్‌ఫోన్ Realme P4 Power 5Gని ఈ రోజు (జనవరి 29న) భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రధాన లక్ష్యం పెద్ద బ్యాటరీ బ్యాక్‌అప్, శక్తివంతమైన ప్రదర్శనను కోరుకునే వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫోన్‌లో హై-రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, కెమెరా ఫీచర్లు, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. కాగా, లాంచ్ ఈవెంట్ ని మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించి, YouTube ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
Read Also: Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్ భారీ ఆశలు.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?
ధరలు మరియు వేరియంట్లు:
Realme P4 Power 5G ప్రారంభ ధర రూ. 25,999గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్, 6 నెలలు నో-కోస్ట్ EMI, 4 సంవత్సరాల ఫ్రీ బ్యాటరీ వారంటీ, రూ. 1,000 ఎక్స్‌చేంజ్ ఆఫర్ వంటి ఆఫర్లను కూడా అందిస్తోంది. అలాగే, ఫిబ్రవరి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు realme.com, Flipkart, రిటైల్ స్టోర్స్ ద్వారా సేల్ ప్రారంభం అవుతుందని కంపెనీ ప్రకటించింది.
* 8GB + 128GB- ట్రాన్స్‌సిల్వర్, ట్రాన్స్‌బ్లూ- రూ. 25,999
* 8GB + 256GB- ట్రాన్స్‌సిల్వర్, ట్రాన్స్‌ఆరెంజ్ ట్రాన్స్‌బ్లూ- రూ. 27,999
* 12GB + 256GB- ట్రాన్స్‌సిల్వర్, ట్రాన్స్‌ఆరెంజ్- రూ. 30,999
బ్యాటరీ & ఛార్జింగ్:
ఈ ఫోన్‌లో 10,001mAh Titan Battery ఉంది. ఇది ఒకే ఛార్జ్‌లో సుమారు 1.5 రోజుల వరకు ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది.
* 80W ఫాస్ట్ ఛార్జింగ్
* 27W రివర్స్ ఛార్జింగ్
బైపాస్ ఛార్జింగ్ (ఇతర డివైస్‌లను ఛార్జ్ చేస్తుంది).. ఈ ఫీచర్స్ ఫోన్‌ను పవర్ యూజర్స్ కోసం మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.
Read Also: Shivam Dube: నేను ఇప్పుడు స్మార్ట్ ప్లేయర్.. శివమ్ దూబే ఆసక్తికర వ్యాఖ్యలు!
డిస్‌ప్లే & ప్రదర్శన:
* 6.8-inch
* 1.5K AMOLED HyperGlow 4D Curve+ డిస్‌ప్లే
* 144Hz రిఫ్రెష్ రేట్
* Smooth స్క్రోలింగ్ & గేమింగ్ కోసం ఉత్తమ అనుభవం
ప్రాసెసర్ & హీటింగ్ కంట్రోల్:
* MediaTek Dimensity 7400 Ultra + HyperVision+ AI చిప్
* 4613mm² AirFlow VC + 13743mm² Extra-large Graphite Area- హీట్ డిసిపేషన్ కోసం
కెమెరా సెటప్:
* 50MP సోనీ OIS ప్రైమరీ కెమెరా
* 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్
* 8MP అల్ట్రా-వైడ్ కెమెరా
* ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా
AI ఫీచర్స్:
* AI ఎడిట్ జీనీ 2.0
* AI ఇన్‌స్టంట్ క్లిప్
* AI పర్ఫెక్ట్ షాట్
* AI లైట్‌మీ & AI స్టైల్‌మీ ఫీచర్లు రియల్‌మీ P4 పవర్ కెమెరాల నుండి మరింత మెరుగైన ఫలితాలను పొందడంలో సహాయపడతాయి.
Read Also: Tirupati Laddu Controversy: చంద్రబాబు అవకాశవాది, అధికారం కోసం దేనికైనా తెగిస్తారు..
సాఫ్ట్‌వేర్
* realme UI 7.0 (Android 16)
* Flux Engine – ultra-realistic motion & seamless animations
* 3 OS upgrades & 4 years security patches
టఫ్‌నెస్:
* IP66, IP68, IP69 – డస్ట్ & వాటర్ రెసిస్టెంట్
* ArmorShell™ ప్రొటెక్షన్
* Corning Gorilla Glass ఫ్రంట్
* కొలతలు: 6.8-inch స్క్రీన్, సురక్షితమైన బాడీ అండ్ మంచి హ్యాండ్ ఫీల్
అయితే, Realme P4 Power 5G ప్రారంభ ధర రూ. 25,999తో మధ్య-రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో పవర్ యూజర్స్, గేమర్స్ కోసం మంచి ఎంపిక అని చెప్పాలి. ఫోన్ శక్తివంతమైన బ్యాటరీ, హై-రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.
