New Smartphones: స్మూత్ డిస్‌ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు రాబోతున్న అద్భుతమైన ఫోన్‌లు, ప్రత్యేకతలు ఇవే..

New Smart Phonesss

New Smart Phonesss

భారత మార్కెట్లోకి రేపు (జూలై 16) రెండు అద్భుతమైన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు అడుగుపెడుతున్నాయి. రియల్‌మీ నుంచి Realme Narzo C100x, వీవో నుంచి Vivo T5 Lite 44W 5G విడుదలవుతున్నాయి. ఈ రెండు ఫోన్ల ప్రత్యేకతలు మీకోసం.

Vivo T5 Lite 44W 5G:
డిస్‌ప్లే అండ్ ప్రాసెసర్: ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగిన భారీ డిస్‌ప్లేతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ , అధునాతన AI ఫీచర్లతో ఇది రన్ అవుతుంది. దీని బాడీ మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ , IP65 వాటర్/డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది. ఇందులో 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేసే 6500mAh భారీ బ్యాటరీ ఉంది, ఇది 38 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది. ఇది వేవ్ బ్లూ, ట్విలైట్ షాడో రంగులలో లభిస్తుంది.

Realme Narzo C100x:
ఈ ఫోన్ 6.8-ఇంచ్ 120Hz అల్ట్రా స్మూత్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో వెట్ హాండ్స్‌తో పనిచేసే రెయిన్ టచ్ మోడ్ కూడా ఉంది. ఇందులో 50MP AI ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 45W ఫాస్ట్ ఛార్జింగ్ కలిగిన అతిపెద్ద 8000mAh బ్యాటరీ అమర్చారు, ఇది నార్మల్ యూసేజ్‌తో 3 రోజులకు పైగా బ్యాకప్ ఇస్తుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్, 2 మీటర్ల డ్రాప్ ప్రొటెక్షన్‌తో బలమైన బిల్డ్ క్వాలిటీ కలిగి ఉంది. దీనిని డీప్‌బ్లూ టైడ్స్, గోల్డెన్ కోస్ట్ రంగులలో కొనుగోలు చేయవచ్చు.

ఈ రెండు ఫోన్లు రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, సంబంధిత బ్రాండ్ వెబ్‌సైట్ల ద్వారా లాంచ్ కానున్నాయి. బడ్జెట్ ధరలో మంచి బ్యాటరీ, డిస్‌ప్లే కోరుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్స్ కానున్నాయి.