Site icon NTV Telugu

రేసింగ్ స్ఫూర్తి.. ప్రత్యేక డిజైన్ తో Realme GT 8 Pro Aston Martin F1 ఎడిషన్ విడుదల..!

Realme Gt 8 Pro Aston Martin F1

Realme Gt 8 Pro Aston Martin F1

Realme GT 8 Pro Aston Martin F1: రియల్ మీ (Realme) సంస్థ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Realme GT 8 Pro సంబంధించి ప్రత్యేక ఎడిషన్‌ను చైనాలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. Realme GT 8 Pro Aston Martin F1 లిమిటెడ్ ఎడిషన్ పేరుతో రాబోతున్న ఈ ఫోన్ Aston Martin ప్రత్యేక ఆకుపచ్చ రంగు, వెనుక భాగంలో ఉన్న ఐకానిక్ రెండు రెక్కల లోగోతో ప్రీమియం మోటార్‌ స్పోర్ట్‌ స్ఫూర్తిని చూపిస్తుంది. డిజైన్‌లో గణనీయమైన మార్పులు ఉన్నప్పటికీ.. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ ప్రధానంగా స్టాండర్డ్ Realme GT 8 Pro స్పెసిఫికేషన్లను పంచుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ నవంబర్ 10న చైనాలో ఉదయం 10 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 7:30) అధికారికంగా ఆవిష్కరించబడుతుంది. ఇప్పటికే కంపెనీ తమ చైనా వెబ్‌సైట్‌లో ఈ వేరియంట్‌కు సంబంధించిన ప్రత్యేక ల్యాండింగ్ పేజీని ప్రారంభించింది.

Bigg Boss 9: బంధాలకి ఎండ్‌ కార్డ్ వేసిన భ‌ర‌ణి.. నామినేష‌న్స్‌లో ఎవరెవ‌రు ఉన్నారంటే?

డిజైన్ పరంగా ఈ వేరియంట్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్డ్ వెనుక ప్యానెల్, ఏరోడైనమిక్ డ్యూయల్-వింగ్ కర్వ్స్‌తో ఆకట్టుకుంటుంది. వెనుక భాగంలో వెండి రంగులో ఉన్న రెండు రెక్కల లోగోతో పాటు ‘Formula One Team’ బ్రాండింగ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా, వినియోగదారులు మార్చుకోదగిన కెమెరా మాడ్యూల్ ద్వారా వివిధ ఆకారాలు లేదా రంగులను ఎంచుకోవచ్చు. Realme GT 7 డ్రీమ్ ఎడిషన్‌తో పోలిస్తే.. ఈ లిమిటెడ్ ఎడిషన్ కూడా ప్రత్యేకమైన ప్యాకేజింగ్‌, సిల్వర్ వింగ్ యాక్సిస్సోరీస్, అలాగే ఆస్టన్ మార్టిన్ బ్రాండింగ్‌కు సరిపోయే కస్టమ్ థీమ్‌లు, ఐకాన్‌లు, వాల్‌పేపర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. భారతదేశంలో నవంబర్ 20న స్టాండర్డ్ Realme GT 8 ప్రో విడుదల కానుండగా.. గతంలో GT 7 లిమిటెడ్ ఎడిషన్ భారత్‌లో కూడా వచ్చిన నేపథ్యంలో ఈ ప్రత్యేక మోడల్ కూడా భారత మార్కెట్‌లో లభించే అవకాశం ఉంది.

Wife Brutally Kills Husband: ఇదేందమ్మా ఇది. . బీడీ కాల్చినందుకు భర్తను దారుణంగా హత్య చేసిన భార్య

ఈ మొబైల్ స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. 6.79 అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది తాజా Snapdragon 8 Elite Gen 5 SoC ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఫోన్‌లో గరిష్టంగా 16GB ర్యామ్, 1TB అంతర్గత స్టోరేజ్ లభించే అవకాశం ఉంది. ఇక 7,000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కెమెరా విభాగంలో 50MP Ricoh GR ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రావైడ్, 200MP టెలిఫోటో కెమెరాలతో ట్రిపుల్ సెటప్, ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉండనుంది. అలాగే ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP69+IP68+IP66 స్థాయి డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు ఉన్నాయి. ఈ ప్రత్యేక Aston Martin F1 Edition ధర, భారత మార్కెట్‌లో అందుబాటు వివరాలు నవంబర్ 10న అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

Exit mobile version