రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!

  • రియల్‌మీ C100i 4G స్మార్ట్‌ఫోన్‌..
  • భారత్‌లో రూ.14,999 ధరకు లాంచ్..
  • 6.8 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
  • 12nm ఆధారిత UNISOC T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌
  • వెనుక 8MP మెయిన్ కెమెరా, ముందు 5MP సెల్ఫీ కెమెరా
  • 6500mAh భారీ బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..
Realme C100i 4g

Realme C100i 4g

Realme C100i 4G: రియల్‌మీ (Realme) నుండి C సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇటీవల C100xను తీసుకొచ్చిన సంస్థ తాజాగా రియల్‌మీ C100iని లాంచ్ చేసింది. 6.8 అంగుళాల పెద్ద డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 6500mAh భారీ బ్యాటరీ, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. బడ్జెట్ సెగ్మెంట్‌లో రోజువారీ వినియోగంతో పాటు మంచి బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి ఇది అందుబాటులో ఉండే ఆప్షన్‌గా నిలవనుంది.

డిస్‌ప్లే & ప్రాసెసర్:

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో 6.8 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 720×1570 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. సాధారణ బ్రైట్‌నెస్ 700 నిట్స్ వరకు ఉండగా, HBM మోడ్‌లో 900 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది. డిస్‌ప్లేకు పాండా@MN228 గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందించారు. పెద్ద స్క్రీన్, అధిక రిఫ్రెష్ రేట్ కారణంగా వీడియోలు చూడటం, సోషల్ మీడియా బ్రౌజింగ్ వంటి పనుల్లో స్మూత్ అనుభూతిని అందించేలా ఫోన్‌ను రూపొందించారు.

మరోవైపు పనితీరు కోసం ఈ ఫోన్‌లో 12nm ఆధారిత UNISOC T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 1.8GHz వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం Mali-G57 MP1 GPU ఉంది. ఇందులో 4GB LPDDR4X RAM, 64GB UFS 2.2 స్టోరేజ్‌ను అందించారు. వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ద్వారా RAMను 12GB వరకు పెంచుకోవచ్చు. అలాగే మైక్రోSD కార్డు ద్వారా స్టోరేజ్‌ను ఏకంగా 2TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత realme UI 6.0పై పనిచేస్తుంది. డ్యూయల్ SIM సపోర్ట్‌తో పాటు మైక్రోSD కార్డు కోసం ప్రత్యేక స్లాట్‌ను అందించారు.

కెమెరా & బ్యాటరీ:

కెమెరా విభాగంలో వెనుక భాగంలో 8MP మెయిన్ కెమెరాను అందించారు. దీనికి f/2.0 అపెర్చర్, LED ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరా ఉంది. ఇది f/2.2 అపెర్చర్‌తో పనిచేస్తుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. 3.5mm హెడ్‌ఫోన్ జాక్, బాటమ్-పోర్టెడ్ అల్ట్రా లీనియర్ స్పీకర్ కూడా ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 6500mAh బ్యాటరీ ఉంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇతర పరికరాలకు ఫోన్ బ్యాటరీ నుంచి పవర్ అందించేందుకు “రివర్స్ వైర్డ్ ఛార్జింగ్” ఫీచర్‌ను కూడా అందించారు.

మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ:

రియల్‌మీ C100iలో ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్ ను అందించారు. కంపెనీ ప్రకారం ఈ ఫోన్ MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో 2 మీటర్ల ఎత్తు నుంచి డ్రాప్ టెస్ట్, కంప్రెషన్ టెస్టులతో పాటు పలు కఠినమైన పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించారు. దీంతో రోజువారీ వినియోగంలో అనుకోకుండా ఫోన్ కిందపడినా మెరుగైన రక్షణ అందించేలా రూపొందించారు. అలాగే డస్ట్, స్ప్లాష్‌ల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ ఉంది. డిజైన్ పరంగా హోరిజోన్ కెమెరా డెకో, రౌండెడ్ కార్నర్స్‌ను అందించారు.

ధర:

కనెక్టివిటీ పరంగా డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS, GLONASS, గెలీలియో, QZSS వంటి ఫీచర్లు ఉన్నాయి. ఛార్జింగ్, డేటా కోసం USB టైపు-C పోర్ట్‌ను ఉపయోగించారు. కాగా ఈ ఫోన్ కొలతలు 166.5×78.2×8.7mm, బరువు 210 గ్రాములుగా ఉన్నాయి. ఈ ఫోన్ స్కైలైన్ సిల్వర్, మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో అమ్మకాలకు అందుబాటులో ఉంది. త్వరలో ఇతర ఆన్‌లైన్ రిటైలర్లు, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా అందుబాటులోకి రానుంది. భారత్‌లో realme C100i 4GB RAM + 64GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ.14,999గా నిర్ణయించారు.