Realme Buds Air8 Pro and Watch S5 Launch: రియల్‌మీ (Realme) తన కొత్త AIoT డివైస్‌ల లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. రియల్‌మీ కొత్తగా తీసుకురానున్న రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 ప్రో (Realme Buds Air8 Pro), రియల్‌మీ వాచ్ S5 (Realme Watch S5) డివైస్‌లు మే 22 న విడుదల కానున్నాయి. వీటితో పాటు కొత్త రియల్‌మీ 16T 5G స్మార్ట్ ఫోన్ కూడా అదే ఈవెంట్‌లో లాంచ్ చేయనుంది.
Realme Buds Air8 Pro ఫీచర్లు:
కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌లో 55dB వరకు అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. పరిసరాల్లో ఉన్న శబ్దాన్ని బట్టి ఆటోమేటిక్‌గా నాయిస్ క్యాన్సిలేషన్‌ను సర్దుబాటు చేసే టెక్నాలజీ ఇందులో ఉండనుంది. ఈ Buds Air8 Proలో 5000Hz నాయిస్ క్యాన్సిలేషన్ బ్యాండ్‌విడ్త్‌తో అల్ట్రా డెప్త్ ANC ఫీచర్ ఇవ్వనున్నారు. 11mm & 6mm డ్యూయల్ డ్రైవర్ లతో కూడిన డ్యూయల్-DAC ఆడియో సిస్టమ్, Hi-Res ఆడియో వైర్ లెస్, LHDC సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటాయి.
వీటితోపాటు AI కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం బోన్-కండక్షన్ మైక్రోఫోన్లు, మొత్తం 6 మైక్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మొత్తం 50 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందుతుందని రియల్‌మీ తెలిపింది. ఫోన్, టాబ్లెట్, PC వంటి మూడు డివైస్ లకు ఒకేసారి కనెక్ట్ అయ్యే మల్టీ-డివైస్ కనెక్టివిటీ కూడా ఇందులో ఉంటుంది. అలాగే NEXTAi ఆధారిత “Ask AI”, AI ట్రాన్స్లేటర్ వంటి ఫీచర్లు కూడా ఇవ్వనున్నారు.
Realme Watch S5 ఫీచర్లు:
రియల్‌మీ కొత్త స్మార్ట్ వాచ్ Watch S5లో 1500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అల్ట్రా బ్రైట్ డిస్‌ప్లే ఇవ్వనున్నారు. Always-On Display (AOD), స్మార్ట్ నైట్ విజన్ ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి. ఈ వాచ్‌కు 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఇవ్వడంతో స్విమ్మింగ్ కార్యకలాపాలకు కూడా ఉపయోగించవచ్చు. 110 స్పోర్ట్స్ మోడ్‌లతో వివిధ వ్యాయామాలు, ఫిట్‌నెస్ యాక్టివిటీలను ట్రాక్ చేయవచ్చు. ఇందులో బిల్ట్-ఇన్ GPSతో పాటు 5 GNSS సపోర్ట్ ఉండటంతో స్మార్ట్‌ఫోన్ అవసరం లేకుండానే రన్నింగ్, ఇతర కార్యకలాపాలను ట్రాక్ చేయొచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 రోజుల వరకు బ్యాటరీ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. AI ఆధారిత 24/7 హెల్త్ మానిటరింగ్ ఫీచర్‌తో పాటు వాయిస్ కమాండ్‌ల కోసం వన్-టచ్ AI అసిస్టెంట్‌ను కూడా ఇందులో అందించనున్నారు.
కొత్త Buds Air8 Pro, Watch S5 డివైస్‌లు రియల్‌మీ ఎకోసిస్టమ్‌తో సులభంగా కనెక్ట్ అయ్యేలా రూపొందించబడ్డాయని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా కొత్త realme 16T 5Gతో క్రాస్-డివైస్ కనెక్టివిటీ మరింత మెరుగ్గా పనిచేస్తుందని పేర్కొంది. ఈ డివైస్‌ల పూర్తి స్పెసిఫికేషన్లు, ధరలు, మార్కెట్ లభ్యత వంటి వివరాలను మే 22న జరిగే అధికారిక లాంచ్ ఈవెంట్‌లో వెల్లడించనున్నారు.
