స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
- మే 22న భారత మార్కెట్లో లాంచ్ కానున్న Realme 16T 5G
- Realme 15Tకు సక్సెసర్‌గా కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల
- భారీ 8000mAh బ్యాటరీ ప్రధాన ఆకర్షణ
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme 16T 5G Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ ను తీసుకురానుంది రియల్మీ (Realme). గత ఏడాది విడుదలైన Realme 15Tకు సక్సెసర్‌గా Realme 16T 5Gను భారత మార్కెట్లో మే 22న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారీ బ్యాటరీ, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్, కొత్త పవర్ మేనేజ్మెంట్ టెక్నాలజీలతో ఈ ఫోన్‌ను హై ఎండ్యూరెన్స్ స్మార్ట్‌ఫోన్ గా రియల్మీ ప్రమోట్ చేస్తోంది.
Realme 16T 5Gలో అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ గా భారీ బ్యాటరీ 8000mAh అని చెప్పాలి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే మూడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందించే సామర్థ్యం కలిగి ఉంది. రియల్మీ అంతర్గత DOU V3.0 హెవీ యూజేజ్ టెస్టింగ్ ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది. దీనిలో ఎక్కువసేపు వీడియో స్ట్రీమింగ్, ట్రావెల్ సమయంలో నావిగేషన్, లాంగ్ గేమింగ్ సెషన్స్ వంటి అధిక పవర్ వినియోగ అవసరాలు ఉన్న యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా BGMI గేమ్‌ను 60FPS స్థిర పనితీరుతో వరుసగా 11 గంటల పాటు ఆడవచ్చని రియల్మీ పేర్కొంది.
Also Read
- Samsung Galaxy Sliding Phone: ఫోల్డబుల్ కాదు.. స్లైడింగ్ డిస్ప్లేతో సామ్ సంగ్ కొత్త ఫోన్! డిజైన్ లీక్
- ISRO PSLV Engine Test: వరుస వైఫల్యాల తర్వాత ఇస్రోకు భారీ విజయం.. పీఎస్ఎల్వీ మూడో దశ ఇంజిన్ టెస్ట్ సక్సెస్!
- Microsoft Outlook Down: మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 సేవలు డౌన్.. సాఫ్ట్ వేర్ దిగ్గజం కీలక ప్రకటన
- Vivo X500 Series: వివో X500 Series ఇండియా లాంచ్ డేట్ వచ్చేసింది.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ
భారీ బ్యాటరీతో పాటు realme 16T 5Gలో “7-ఏళ్ల బాటరీ హెల్త్” టెక్నాలజీని కూడా అందిస్తోంది. ప్రత్యేక బ్యాటరీ మేనేజ్మెంట్ అల్గారిథమ్‌ల సహాయంతో బ్యాటరీ సామర్థ్యం త్వరగా తగ్గిపోకుండా ఈ టెక్నాలజీ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. వీటితో పాటు అన్ని పరిస్థితులలో బైపాస్ ఛార్జింగ్, అధునాతన ఉష్ణోగ్రత రక్షణ, ఓవర్‌ఛార్జ్ రక్షణ వంటి పవర్ మేనేజ్మెంట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని వల్ల ఎక్కువసేపు ఉపయోగించినా ఫోన్ వేడి తగ్గి, ఛార్జింగ్ స్థిరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ మొబైల్ కేవలం 8.88mm మందంతో స్లిమ్ ప్రొఫైల్‌ను కలిగి ఉంది. ఇందులో 6.8 అంగుళాల ఫ్లాట్ డిస్ప్లేను అందిస్తున్నారు. ఫోన్ మిడ్ ఫ్రేమ్‌కు మెటాలిక్ ఫినిష్ ఇవ్వగా, కెమెరా మాడ్యూల్‌ను అల్యూమినియం అల్లాయ్‌తో రూపొందించారు. ఫోన్ వెనుక భాగంలో “Gleaming Wings” గ్రేడియంట్ టెక్స్చర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మల్టీ కలర్ పార్టికల్స్‌తో రూపొందించిన ఈ డిజైన్‌లో సిల్వర్, గ్రీన్, గ్లిట్టర్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఈ మొబైల్ అరోరా ఆకుపచ్చ, స్టార్ లైట్ ఎరుపు, స్టార్ లైట్ నలుపు అనే మూడు కలర్ వేరియంట్లలో లభించనుంది. మే 22న అధికారిక లాంచ్ తర్వాత ఫ్లిప్‌కార్ట్, రియల్మీ అధికారిక వెబ్సైట్, ప్రధాన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలను లాంచ్ ఈవెంట్లో కంపెనీ ప్రకటించనుంది.
తాజావార్తలు
-
Samsung Galaxy Sliding Phone: ఫోల్డబుల్ కాదు.. స్లైడింగ్ డిస్ప్లేతో సామ్ సంగ్ కొత్త ఫోన్! డిజైన్ లీక్
-
Pat Cummins: “నాకు అస్సలు తెలియదు”.. బాల్ ట్యాంపరింగ్ అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్
-
CII Partnership Summit Day 2: సీఐఐ సదస్సులో రెండో రోజు కీలక పరిణామాలు.. చంద్రబాబు ఫుల్ బిజీ..!
-
Jensen Huang Third Girlfriend: జెన్సన్ హువాంగ్ మూడో గర్ల్‌ఫ్రెండ్ ఎవరు?.. ఎన్విడియా సీఈఓపై మరో సంచలన ఆరోపణలు!
-
Cyclone Alert to AP: ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!