NTV Telugu Site icon

Realme 12Pro Launch: రియల్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర ఎంతంటే?

Realmi12

Realmi12

ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ సరికొత్త ఫీచర్స్ అదిరిపోయే ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా స్టన్నింగ్ ఫీచర్స్ మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఫ్రీ సేల్స్ భారీగా జరిగినట్లు తెలుస్తుంది.. ఆ ఫోన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రియల్‌మి 12 ప్రో 5జీ సిరీస్‌లో 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. రియల్‌మి 12 ప్రో ప్లస్ 5జీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెనరేషన్ 2 ఎస్ఓసీలో రన్ అవుతుంది. ఇక లైనప్‌లో సరసమైన ఆప్షన్ అయిన రియల్‌మి 12 ప్రో 5జీ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది.. 6.7-అంగుళాల పూర్తి-హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో 93 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 2160హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే పీ3 కలర్ 100 శాతం కవరేజీని కలిగి ఉంది..

ఇక కెమెరా విషయానికొస్తే.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4 ఇన్ 1-పిక్సెల్ ఫ్యూజన్ టెక్నాలజీ తో కూడిన 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్ 890 సెన్సార్ హెడ్‌లైన్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందిస్తుంది. కెమెరా సెటప్‌లో ఓఐఎస్, ఓవీ64బీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉన్నాయి…రియల్‌మి 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ను కలిగి 48 నిమిషాల్లో బ్యాటరీని 100 శాతానికి ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. చాలా బాగా పనిచేస్తుంది..

ఇక ధర విషయానికొస్తే..12 ప్రో ప్లస్ 5జీ బేస్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999కు పొందవచ్చు. ఈ ఫోన్ 8జీబీ+ 256జీబీ మోడల్‌లో కూడా వస్తుంది. దీని ధర రూ. 31,999 ఉంటుంది. టాప్-ఆఫ్-లైన్ 12జీబీ + 256జీబీ ఆప్షన్ ధర రూ. 33,999కు పొందవచ్చు.. స్టోరేజ్, వేరియంట్ ను బట్టి ధర కూడా మారుతుంది.. ఇక ఈ ఫోన్ 8.75ఎమ్ఎమ్ మందం, 196 గ్రాముల బరువు ఉంటుంది..

Show comments