Site icon NTV Telugu

బ్యాటరీ బాంబ్ పేల్చిన Realme.. 10,001mAhతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం..!

Real Me

Real Me

Realme 10001mAh: ఈ ఏడాది ప్రారంభంలో రియల్‌మీ (Realme) కంపెనీ 10,000mAh భారీ బ్యాటరీతో కూడిన ఒక స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించి టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, అది కేవలం కాన్సెప్ట్ డివైస్ మాత్రమే కాగా, వినియోగదారులకు విక్రయాల కోసం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు తాజాగా రియల్‌ మీ మరింత పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి రెడీ అవుతుందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, టెలిగ్రామ్ వేదికగా లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఓ మిస్టరీ రియల్‌ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 10,001mAh బ్యాటరీ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్‌కు RMX5107 అనే మోడల్ నంబర్ ఉంది. ఇది ఇప్పటి వరకు రియల్‌ మీ నుంచి వచ్చిన అత్యధిక బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్ కావొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read Also: Unnao Rape case: కుల్దీప్ సెంగర్‌కు షాక్.. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే

రియల్‌ మీ UI 7.0, ఆండ్రాయిడ్ 16 సపోర్ట్
‘అబౌట్ డివైస్’ వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ రియల్‌ మీ UI 7.0పై వర్క్ చేస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రూపొందించిన రియల్‌ మీ తాజా ఆపరేటింగ్ సిస్టమ్. గత నెలలోనే ఈ UIని కంపెనీ అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఇంకా వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు. ఈ ఫోన్‌లో 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నట్లు తెలుస్తుంది. అదనంగా వర్చువల్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్ సపోర్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది.

Read Also: The Raja Saab : డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..ది రాజాసాబ్’ రిలీజ్ ట్రైలర్ అప్‌డేట్.. !

బ్యాటరీ విషయంలో హానర్‌తో పోటీ
ఇటీవల హానర్ (Honor) కంపెనీ చైనాలో త్వరలో విడుదల చేయనున్న Honor Power 2 స్మార్ట్‌ఫోన్‌లో 10,000mAh బ్యాటరీ ఉంటుందని ప్రకటించింది. అయితే, తాజా లీక్స్ ప్రకారం, రియల్‌ మీ ఈ విషయంలో హానర్‌ను కూడా మించనుంది. 10,001mAh బ్యాటరీతో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వస్తే, బ్యాటరీ సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పే ఛాన్స్ ఉంటుంది.

ఇతర ఫీచర్లు, లాంచ్ వివరాలు
ఈ మిస్టరీ రియల్‌ మీ ఫోన్‌కు Hi-Res Audio సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే, ఈ డివైస్‌ను రష్యాలో విక్రయాల కోసం అవసరమైన సర్టిఫికేషన్ కూడా లభించినట్లు సమాచారం. అయితే అధికారిక లాంచ్ తేదీ మాత్రం ఇంకా వెల్లడికాలేదు.

రియల్‌మీ GT కాన్సెప్ట్ ఫోన్ టెక్నాలజీ
ఇంతకు ముందు రియల్‌ మీ ప్రదర్శించిన 10,000mAh GT కాన్సెప్ట్ ఫోన్ కేవలం 8.5mm మందంతో, సుమారు 200 గ్రాముల బరువుతోనే ఉండటం విశేషం. దీనికి కారణం కంపెనీ ఉపయోగించిన మినీ డైమండ్ ఆర్కిటెక్చర్. ఈ టెక్నాలజీతో అంత పెద్ద బ్యాటరీని కూడా సన్నని డిజైన్‌లో అమర్చగలిగే అవకాశం ఉంటుంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆండ్రాయిడ్ మైన్‌బోర్డ్ (23.4mm)ను ఉపయోగించినట్లు రియల్‌ మీ వెల్లడించింది. అలాగే, ఈ బ్యాటరీలో అల్ట్రా హై సిలికాన్ అనోడ్ టెక్నాలజీని ఉపయోగించారు. 10 శాతం సిలికాన్ కంటెంట్‌తో రూపొందిన ఈ బ్యాటరీకి 887Wh/L ఎనర్జీ డెన్సిటీ ఉండటంతో, సాధారణ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే మెరుగైన పని తీరు అందిస్తుందని రియల్ మీ కంపెనీ పేర్కొంది.

టెక్ ప్రపంచంలో ఆసక్తి
ఇప్పుడు ఈ టెక్నాలజీతో 10,001mAh బ్యాటరీ కలిగిన రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వస్తే, భారీ బ్యాటరీ ఫోన్ల సెగ్మెంట్‌లో కొత్త ట్రెండ్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఈ ఫోన్ విడుదల అధికారిక ప్రకటన కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version