AI Robot Girlfriend: మార్కెట్లోకి ఏఐ గర్ల్‌ఫ్రెండ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
- మార్కెట్ లోకి ఏఐ రోబోట్ గర్ల్ ఫ్రెండ్
- అమెరికన్ టెక్ కంపెనీ రియల్‌బోటిక్స్ Aria'ని పరిచయం చేసింది
- ధర దాదాపు రూ. 1.5 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. ఇదివరకు రోబోలు మానవాళిని ఆశ్చర్యానికి గురిచేయగా ఇప్పుడు ఏఐ రోబోట్ లు మనుషుల కంటే ఏం తక్కువ కాదు అన్న రీతిలో హల్ చల్ చేస్తున్నాయి. ఏఐ రోబోలు మానవుల భావోద్వేగాలను, భావాలను అర్థం చేసుకోగలవు. కొంత కాలం క్రితం ఏఐ యాంకర్స్ ను సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఏఐ రోబోట్ గర్ల్ ఫ్రెండ్ అందుబాటులోకి వచ్చింది.
ఇటీవల, లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2025) లో , అమెరికన్ టెక్ కంపెనీ రియల్‌బోటిక్స్ అత్యాధునిక AI రోబోట్ ‘Aria’ని పరిచయం చేసింది. ఇది మానవుల మాదిరిగానే ముఖ కవలికలను, వ్యక్తీకరణలను చూపించగలదు. మరి ఈ ఏఐ రోబోటిక్ గర్ల్ ఫ్రెండ్ ధర ఎంతో తెలుసా? తెలిస్తే షాకవ్వకుండా ఉండలేరు. మీరు ఏఐ రోబోటిక్ గర్ల్ ఫ్రెండ్ ను కొనాలంటే కోట్లు వెచ్చించాల్సిందే. దీన్ని మీరు సొంతం చేసుకోవాలంటే దాదాపు రూ. 1.5 కోట్లు చెల్లించాలి. రియల్‌బోటిక్స్ సీఈఓ ఆండ్రూ కిగుయెల్ మాట్లాడుతూ.. ఈ రోబోట్ సమాజంలో పెరుగుతున్న “పురుషుల ఒంటరితనం సమస్య”కి ఒక పరిష్కారాన్ని అందించగలదని అన్నారు.
Also Read
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
- Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
ఈ ఏఐ రోబోటిక్ గర్ల్ ఫ్రెండ్ లో 17 మోటార్లు అమర్చారు. ఈ మోటార్లు ఇది మెడను కదిలించడంలో, ఇతర కదలికలలో సాయపడతాయి. దాని ముఖం, జుట్టు రంగు, హెయిర్‌స్టైల్ మొదలైన వాటిని మార్చవచ్చు. అరియా ముఖ కవళికలను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. రియల్ బోటిక్స్ అరియాకు సంబంధించిన మూడు వెర్షన్స్ ను ప్రవేశపెట్టింది.
మొదటి వేరియంట్లో మెడ పైన భాగం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం 10,000 అమెరికన్ డాలర్లు అంటే సుమారు 8 లక్షల 60 వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. రెండవది మాడ్యులర్ వెర్షన్. దీని ధర రూ.1 కోటి 29 లక్షలు. కాగా, మూడో ఆప్షన్ ఫుల్ సైజ్ మోడల్. దీని ధర దాదాపు రూ. 1 కోటి 50 లక్షలు. ఈ సంస్థ సోషల్ ఇంటెలిజెన్స్, నిజమైన మనుషుల వంటి ఫీచర్లతో రోబోలను సృష్టిస్తుంది.
Meet Aria: The $175K AI Girlfriend Who’s More Than Just Code
Imagine a world where loneliness is history, and your companion is not just human-like but almost indistinguishable from one. Enter Aria, the latest marvel from Realbotix, showcased at the 2025 Consumer Electronics… pic.twitter.com/Yh6irO2ovC
— 🤖Durak the Robot (@Crypto_AI1212) January 11, 2025
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!