NTV Telugu Site icon

AI Robot Girlfriend: మార్కెట్‌లోకి ఏఐ గర్ల్‌ఫ్రెండ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

Ai Robot Girlfriend

Ai Robot Girlfriend

టెక్నాలజీతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. ఇదివరకు రోబోలు మానవాళిని ఆశ్చర్యానికి గురిచేయగా ఇప్పుడు ఏఐ రోబోట్ లు మనుషుల కంటే ఏం తక్కువ కాదు అన్న రీతిలో హల్ చల్ చేస్తున్నాయి. ఏఐ రోబోలు మానవుల భావోద్వేగాలను, భావాలను అర్థం చేసుకోగలవు. కొంత కాలం క్రితం ఏఐ యాంకర్స్ ను సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఏఐ రోబోట్ గర్ల్ ఫ్రెండ్ అందుబాటులోకి వచ్చింది.

ఇటీవల, లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2025) లో , అమెరికన్ టెక్ కంపెనీ రియల్‌బోటిక్స్ అత్యాధునిక AI రోబోట్ ‘Aria’ని పరిచయం చేసింది. ఇది మానవుల మాదిరిగానే ముఖ కవలికలను, వ్యక్తీకరణలను చూపించగలదు. మరి ఈ ఏఐ రోబోటిక్ గర్ల్ ఫ్రెండ్ ధర ఎంతో తెలుసా? తెలిస్తే షాకవ్వకుండా ఉండలేరు. మీరు ఏఐ రోబోటిక్ గర్ల్ ఫ్రెండ్ ను కొనాలంటే కోట్లు వెచ్చించాల్సిందే. దీన్ని మీరు సొంతం చేసుకోవాలంటే దాదాపు రూ. 1.5 కోట్లు చెల్లించాలి. రియల్‌బోటిక్స్ సీఈఓ ఆండ్రూ కిగుయెల్ మాట్లాడుతూ.. ఈ రోబోట్ సమాజంలో పెరుగుతున్న “పురుషుల ఒంటరితనం సమస్య”కి ఒక పరిష్కారాన్ని అందించగలదని అన్నారు.

ఈ ఏఐ రోబోటిక్ గర్ల్ ఫ్రెండ్ లో 17 మోటార్లు అమర్చారు. ఈ మోటార్లు ఇది మెడను కదిలించడంలో, ఇతర కదలికలలో సాయపడతాయి. దాని ముఖం, జుట్టు రంగు, హెయిర్‌స్టైల్ మొదలైన వాటిని మార్చవచ్చు. అరియా ముఖ కవళికలను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. రియల్ బోటిక్స్ అరియాకు సంబంధించిన మూడు వెర్షన్స్ ను ప్రవేశపెట్టింది.

మొదటి వేరియంట్‌లో మెడ పైన భాగం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం 10,000 అమెరికన్ డాలర్లు అంటే సుమారు 8 లక్షల 60 వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. రెండవది మాడ్యులర్ వెర్షన్. దీని ధర రూ.1 కోటి 29 లక్షలు. కాగా, మూడో ఆప్షన్ ఫుల్ సైజ్ మోడల్. దీని ధర దాదాపు రూ. 1 కోటి 50 లక్షలు. ఈ సంస్థ సోషల్ ఇంటెలిజెన్స్, నిజమైన మనుషుల వంటి ఫీచర్లతో రోబోలను సృష్టిస్తుంది.