Site icon NTV Telugu

WhatsApp Tips: ఇలా చేస్తే వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవచ్చు!

Read Deleted Whatsapp Messa

Read Deleted Whatsapp Messa

WhatsApp Tips: ఈ రోజుల్లో వాట్సాప్ లేని ఫోన్‌లను ఊహించుకోవడం కష్టం. అంతలా మనుషుల జీవితాల్లో వాట్సాప్ అనేది భాగం అయ్యింది. ఆఫీస్ వర్క్ కోసమే, కాలేజీలో సార్ పెట్టే నోట్స్ గురించో, ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రేమించిన అమ్మాయితో మాట్లాడటానికో వాట్సాప్ ఉపయోగించడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయ్యింది. ఇంతకీ వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవడం మీలో ఎంత మందికి తెలుసు.. అయితే ఈ స్టోరీలో వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవడం ఎలాగో తెలుసుకుందాం..

READ ALSO: Buy Gold For ₹1: రూపాయికే బంగారం.. ఎక్కడ అమ్ముతున్నారో తెలుసా!

ప్రపంచవ్యాప్తంగా WhatsApp అనేది ఒక ప్రసిద్ధ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్. ఈ యాప్ Delete for Everyone తో సహా అనేక ఫీచర్‌లను వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించి ఎవరైనా WhatsApp వినియోగదారు వారు పంపిన సందేశాలను నిర్దిష్ట సమయంలో తొలగించవచ్చు. అయితే ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, చాలా మంది డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవడానికి ఆసక్తి చూపుతారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఫోన్ సెట్టింగ్‌లలో కొన్ని మార్పులు చేయడం ద్వారా డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజ్‌లను చదవవచ్చు. ఇంతకీ మీరు ఏం చేయాలో తెలుసా..

ముందుగా మీరు మీ ఫోన్‌లో వాట్సాప్ నోటిఫికేషన్‌లను ఆన్ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లండి, అక్కడ మీకు నోటిఫికేషన్‌ల ఎంపిక కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, ఆపై మరిన్ని ఎంపికను ఎంచుకోవాలి. ఇక్కడ మీరు నోటిఫికేషన్ హిస్టరీ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ ఆప్షన్‌ను ఆన్ చేయాలి. ఇది మీ ఫోన్‌కు వచ్చిన అన్ని నోటిఫికేషన్‌ల చరిత్రను 24 గంటల పాటు రికార్డ్ చేసి ఉంచుతుంది. ఇక్కడ ఎవరైనా మీకు మెసేజ్ పంపించి డిలీట్ చేస్తే వాటిని చదవడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు ఇప్పటికే WhatsApp నోటిఫికేషన్‌లను ఆన్ చేస్తే, మీ ఫోన్‌కు వచ్చే అన్ని మెసేజ్‌లు మీ నోటిఫికేషన్ హిస్టరీ సేవ్ చేసి ఉంటాయి. ఇక్కడ మీరు మీకు పంపించి డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవాలనుకుంటే ముందుగా మీరు నోటిఫికేషన్ హిస్టరీకి వెళ్లి మీకు పంపించి డిలీట్ చేసిన సందేశాన్ని గుర్తించాలి.

ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే మీ నోటిఫికేషన్ హిస్టరీ నుంచి మీరు ఫోటోలు, వీడియోలు లేదా లింక్‌లను యాక్సెస్ చేయలేరు. దీని అర్థం ఏమిటంటే.. ఎవరైనా మీకు ఫోటో, వీడియో లేదా లింక్‌ను పంపి, ఆపై దాన్ని డిలీట్ చేస్తే, మీరు దానిని యాక్సెస్ చేయలేరు. ఈ నోటిఫికేషన్‌ హిస్టరీ అనేది కేవలం 24 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కొన్నిసార్లు, కొన్ని సందేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లు కనిపించవు, అవి హిసర్టీలో కూడా అందుబాటులో ఉండవు. ఈ ట్రిక్‌ని ఉపయోగించి, మీకు పంపించి డిలీట్ చేసిన WhatsApp సందేశాలను చదవవచ్చు.

READ ALSO: Auto Sweep Facility: సేవింగ్ ఖాతాలో ఎఫ్డీ వడ్డీ పొందొచ్చు.. ఈ ఆప్షన్ గురించి తెలుసా?

Exit mobile version