Honor Magic 8 Pro Air: వచ్చే వారం హానర్ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను చైనా మార్కెట్‌లో విడుదల చేయనుంది. జనవరి 19న హానర్ మ్యాజిక్ 8 ప్రో ఎయిర్, హానర్ మ్యాజిక్ 8 RSR పొర్స్చే డిజైన్ మోడళ్లను అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. లాంచ్‌కు ముందు ఈ ఫోన్లకు సంబంధించిన కీలక వివరాలను హానర్ టీజర్ల ద్వారా తెలుపుతుంది.
తాజాగా విడుదలైన టీజర్ ప్రకారం హానర్ మ్యాజిక్ 8 ప్రో ఎయిర్ (Honor Magic 8 Pro Air) ఫోన్‌లో 5,500mAh సామర్థ్యంతో కూడిన ‘Qinghai Lake’ బ్యాటరీని అందించనున్నారు. అలాగే ఈ ఫోన్‌లో 1/1.3 అంగుళాల మెయిన్ కెమెరా సెన్సార్‌తో పాటు 64 MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. Honor అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో కనిపించిన వివరాల ప్రకారం Magic 8 ప్రో ఎయిర్ నాలుగు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో విడుదల కానుంది.
ఈ ఫోన్‌లో MediaTek Dimensity 9500 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉందని సమాచారం. కేవలం 6.1mm మందంతో, 155 గ్రాముల బరువుతో ఈ ఫోన్‌ను రూపొందించారు. ఫెయిరీ పర్పల్, లైట్ ఆరంజ్, ఫీథెర్ వైట్, షాడో బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది.
Pushpa – 3 : బన్నీ బిజీ.. పుష్ప – 3 పనులు స్టార్ట్ చేసిన సుకుమార్?
మరోవైపు హానర్ మ్యాజిక్ 8 RSR పొర్స్చే (Honor Magic 8 RSR Porsche) డిజైన్ మోడల్ ప్రత్యేక ఫీచర్లతో ఆకట్టుకోనుంది. ఈ ఫోన్‌తో పాటు ప్రత్యేకంగా రూపొందించిన ఫోటోగ్రఫీ కిట్ ను కూడా హానర్ అందించనుంది. ఇందులో అడాన్ టెలిఫోటో ఎక్స్‌టెండర్, కెమెరా గ్రిప్ వంటి యాక్సెసరీస్ ఉంటాయి. ఇది 2.35x టెలికన్వర్టర్‌కు సపోర్ట్ చేస్తుందని, ఇండస్ట్రీలోనే అత్యుత్తమంగా చెప్పుకునే CIPA 6.5-లెవల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ మోడల్ మూన్ స్టోన్, స్లేట్ రంగుల్లో విడుదల కానుంది. ఈ ఫోన్‌లో గరిష్ఠంగా 24GB ర్యామ్ ఆప్షన్ కూడా ఉండనుంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
