1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Portronics Beem 570 Launch: భారతీయ ఎలక్ట్రానిక్స్ కంపెనీ పోర్ట్రోనిక్స్ (Portronics) నుండి కొత్తగా Beem 570 స్మార్ట్ ప్రొజెక్టర్‌ను లాంచ్ చేసింది. ఈ ఏడాది మొదట్లో వచ్చిన Beem 560 తర్వాత, మరింత మెరుగైన ఫీచర్లతో ఈ కొత్త మోడల్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ కాంపాక్ట్ డిజైన్‌తో పాటు అధునాతన విజువల్స్, స్మార్ట్ ఫీచర్లు, బిల్ట్-ఇన్ స్ట్రీమింగ్ సపోర్ట్‌తో ఇది పూర్తి ఎంటర్టైన్మెంట్ డివైస్ గా రూపొందించబడింది.
మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
Beem 570 డిజైన్ పరంగా సిల్వర్ ఫినిష్ తో కనిపిస్తుంది. 270-డిగ్రీల అడ్జస్టబుల్ డిజైన్ ఉండటం వల్ల లివింగ్ రూమ్, బెడ్రూమ్ వంటి వివిధ ప్రదేశాల్లో సులభంగా ప్రొజెక్షన్ యాంగిల్ ను మార్చుకోవచ్చు. విజువల్ పనితీరులో ఇది 1080p ఫుల్ HD రిజల్యూషన్, 10,000 లూమెన్స్ బ్రైట్నెస్, 120 అంగుళాల వరకు స్క్రీన్ సైజ్ సపోర్ట్ అందిస్తుంది. అంతేకాకుండా 50,000 గంటల ల్యాంప్ లైఫ్ ఉండటం ఎక్కువ సేపు వినియోగానికి అనుకూలంగా మారుస్తుంది.
సాఫ్ట్వేర్ పరంగా ఈ ప్రొజెక్టర్ వేల్ టీవీ OS (Whale TV OS)పై పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఇంటర్ఫేస్ను కలిగి ఉంది. ఇందులో నెట్ఫ్లిక్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లు ముందే ఇన్స్టాల్ అయి ఉంటాయి. దీనివల్ల విడిగా సెటప్ బాక్స్ అవసరం లేకుండా నేరుగా కంటెంట్‌ను వీక్షించవచ్చు. వినియోగదారుల సౌలభ్యం కోసం ఈ ప్రొజెక్టర్‌లో పలు ఆటోమేటిక్ ఫీచర్లు ఉన్నాయి. ఆటోఫోకస్ ద్వారా చిత్రాన్ని స్పష్టంగా ఉంచుతుంది. ఆటో కీస్టోన్ కరెక్షన్ వల్ల ఎటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేసినా స్క్రీన్ సరిగ్గా కనిపిస్తుంది. అలాగే ఆటో అలైన్మెంట్, ఆబ్స్టాకిల్ అవాయిడెన్స్ ఫీచర్లతో గోడపై ఉన్న అడ్డంకులను గుర్తించి స్క్రీన్ ను సరైన స్థలంలో సెట్ చేస్తుంది.
ఆడియో పరంగా ఇందులో 5W ఇన్ బిల్ట్ స్పీకర్ ఉండి సాధారణ వినోదానికి సరిపడే సౌండ్ ను అందిస్తుంది. కనెక్టివిటీ విషయంలో డ్యుయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4, HDMI, USB పోర్టులు ఉన్నాయి. స్క్రీన్ మిర్రరింగ్ సపోర్ట్‌తో మొబైల్, ల్యాప్‌టాప్‌ల నుంచి వైర్ లేకుండా కంటెంట్‌ను ప్రొజెక్ట్ చేయవచ్చు. ధర విషయానికి వస్తే.. ఈ పోర్ట్రోనిక్స్ Beem 570 ధర రూ.19,999గా నిర్ణయించారు. ఇది అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, దేశవ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఈ ప్రొజెక్టర్‌కు కంపెనీ 12 నెలల వారంటీ కూడా అందిస్తోంది.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!