POCO M8s 5G Launched: పోకో (POCO) నుండి కొత్తగా మిడ్‌రేంజ్ స్మార్ట్ ఫోన్ POCO M8s 5G ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మొబైల్ లో 6.9 అంగుళాల FHD+ డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనితో స్క్రోలింగ్ & గేమింగ్ అనుభవం స్మూత్‌గా ఉంటుంది. ఇందులోని ‘వెట్ టచ్ టెక్నాలజీ 2.0’ వల్ల చేతులు తడిగా ఉన్నా టచ్ రిస్పాన్స్ లో సమస్యలు ఎదురవవ్వు. అలాగే కళ్ల రక్షణ కోసం TÜV Rheinland నుంచి మూడు సర్టిఫికేషన్లు పొందింది.
డిజైన్ పరంగా క్వాడ్ కర్వ్డ్ బ్యాక్, మెటల్ ఫినిష్ కెమెరా మాడ్యూల్‌తో ప్రీమియం లుక్ అందిస్తుంది. IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ స్ప్లాష్‌ల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. అలాగే దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ కూడా అందించారు. ఈ ఫోన్‌కు స్నాప్ డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్ ఉండగా.. ఇది 6nm టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఇందులో 16GB వరకు ర్యామ్ ఎక్స్‌టెన్షన్ సపోర్ట్, 2TB వరకు మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకునే అవకాశం ఉంది.
Tilak Varma: తొలి 19 బంతుల్లో 0.. తర్వాతి 23 బంతుల్లో విధ్వంసం.. తిలక్ బ్యాటింగ్ సాగిందిలా!
సాఫ్ట్‌వేర్ పరంగా Xiaomi HyperOSపై ఆండ్రాయిడ్ 15 రన్ అవుతుంది. గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్ వంటి AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. “200% వాల్యూమ్ బూస్ట్” ఫీచర్‌తో శబ్దం మరింత గట్టిగా వినిపిస్తుంది. ఇక కెమెరా విషయంలో 50MP AI డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. AI ఏరేజ్, AI స్కై వంటి క్రియేటివ్ టూల్స్ తో ఫోటోలను నేరుగా ఫోన్‌లోనే ఎడిట్ చేసుకోవచ్చు. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 7000mAh భారీ బ్యాటరీ. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు ఉపయోగించవచ్చని కంపెనీ చెబుతోంది. 1600 చార్జ్ సైకిళ్ల తర్వాత కూడా 80% బ్యాటరీ సామర్థ్యం నిలుపుకుంటుందని పేర్కొంది. -20°C వంటి తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా బ్యాటరీ పనితీరు స్థిరంగా పనిచేస్తుంది. 1% బ్యాటరీ ఉన్నప్పటికీ 59 నిమిషాల కాల్స్ లేదా 7.5 గంటల స్టాండ్‌బై టైమ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 33W ఫాస్ట్ చార్జింగ్, 18W రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా దీనికి ఉంది.
Digital Vastu Tips: ఈ మూడు మీ మొబైల్ ఫోన్ నుంచి తొలగించండి.. అదృష్టం మారిపోతుంది..!
POCO M8s 5G మొబైల్ బ్లాక్, వైట్ రెండు కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఇక ధర చూస్తే.. 6GB + 128GB వేరియంట్ ధర రూ.17,600 కాగా, 8GB + 256GB వేరియంట్ ధర రూ.20,395 గా నిర్ణయించారు.
