Digital Vastu Tips: ఈ మూడు మీ మొబైల్ ఫోన్ నుంచి తొలగించండి.. అదృష్టం మారిపోతుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digital Vastu Tips: ఈ రోజుల్లో మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌లు మన జీవితంలో విడదీయరాని భాగంగా మారాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనం ఎక్కువ సమయం స్క్రీన్లతోనే గడుపుతున్నాం. అందుకే చాలామంది ఇప్పుడు “డిజిటల్ వాస్తు” గురించి ఆసక్తి చూపిస్తున్నారు. మన చుట్టూ ఉండే వాతావరణం ఎలా మన మనస్తత్వంపై ప్రభావం చూపుతుందో, అలాగే స్క్రీన్‌పై కనిపించే దృశ్యాలు కూడా మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని నమ్మకం.
డిజిటల్ వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, మొబైల్, ల్యాప్‌టాప్‌లలో కొన్ని మార్పులు చేస్తే సానుకూల ఆలోచనలు పెరుగుతాయని, పనిలో ఏకాగ్రత మెరుగవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫోన్లోని మూడు విషయాలను తొలగించాలని సూచిస్తున్నారు.
Also Read
- Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
- Low Cost House Construction: రూ.5 లక్షలకే సొంత ఇల్లు.. ఇటుకలు, సిమెంట్ లేకుండానే నిర్మాణం..? అద్భుతమైన టెక్నాలజీ!
- Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
- Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
1. ప్రతికూల వాల్పేపర్లను వెంటనే మార్చండి
మనం రోజులో ఎన్నోసార్లు మొబైల్ స్క్రీన్ చూస్తుంటాం. అందువల్ల వాల్‌పేపర్ ఎంతో ముఖ్యమని భావిస్తారు. పాడుబడిన భవనాలు, విచారకరమైన ముఖాలు, యుద్ధ దృశ్యాలు, హింసాత్మక జంతువుల చిత్రాలు వంటివి పెట్టకూడదని చెబుతున్నారు. ఇవి మనసులో నెగెటివ్ భావనలు పెంచుతాయని చెబుతారు.. అందుకే.. దానికి బదులుగా ఉదయించే సూర్యుడు, పచ్చని ప్రకృతి దృశ్యాలు, ప్రవహించే నీరు, పర్వతాలు వంటి చిత్రాలు పెట్టుకుంటే ఉత్సాహం పెరుగుతుందని అంటున్నారు.
2. ఉపయోగం లేని పాత యాప్‌లను తొలగించండి
చాలామంది మొబైల్లో ఎన్నో యాప్‌లు ఇన్స్టాల్ చేసి తర్వాత వాటిని ఉపయోగించరు. ఇలా ఉండటం వల్ల ఫోన్ స్లో అవడమే కాకుండా, డిజిటల్ గందరగోళం పెరుగుతుంది. అవసరం లేని పాత యాప్‌లను తొలగిస్తే ఫోన్ పనితీరు మెరుగవుతుంది. కొత్త అవకాశాలకు స్థలం కలిగినట్లే మానసికంగా కూడా తేలికగా అనిపిస్తుందని చెబుతున్నారు.
3. పాత మెసేజ్‌లు, ఇమెయిల్‌లు క్లియర్ చేయండి
వేల సంఖ్యలో చదవని మెసేజ్‌లు, ఈమెయిల్‌లు ఉండటం కూడా ఒత్తిడికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అనవసరమైన చాట్లు, పాత ఈమెయిల్‌లు తొలగించడం ద్వారా డిజిటల్ స్పేస్ శుభ్రంగా ఉంటుంది. ఇది పనిపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.
ల్యాప్‌టాప్‌కు కూడా వాస్తు చిట్కాలు
ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను పరిశుభ్రంగా ఉంచడం, తెలుపు లేదా నీలం రంగు వాల్పేపర్లు వాడడం మంచిదని సూచిస్తున్నారు. ఇవి ప్రశాంతత, స్పష్టమైన ఆలోచనలకు దోహదపడతాయని అంటున్నారు.
రాత్రిపూట డిజిటల్ డిటాక్స్ మంచిదే
నిద్రకు ముందు కనీసం ఒక గంట స్క్రీన్లకు దూరంగా ఉండడం మంచిది. అలాగే మొబైల్‌ను తల దగ్గర పెట్టుకుని నిద్రపోవడం మానుకోవాలని సూచిస్తున్నారు.
గుర్తుంచుకోవాల్సిన విషయం
ఈ సూచనలు శాస్త్రీయంగా నిర్ధారించబడిన వాస్తవాలు కాకపోయినా, డిజిటల్ శుభ్రత, స్క్రీన్ అలవాట్లు, ప్రశాంత వాతావరణం మాత్రం నిజంగానే మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అందువల్ల ఫోన్‌ను శుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచుకోవడం మాత్రం మంచి అలవాటే అంటున్నారు..
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!