Site icon NTV Telugu

100W ఛార్జింగ్, OLED డిస్ప్లేలు, Bose స్పీకర్లతో Poco F8 సిరీస్ గ్లోబల్ లాంచ్..!

Poco F8

Poco F8

Poco F8: పోకో (Poco) తాజాగా గ్లోబల్ మార్కెట్లలో తన కొత్త ప్రీమియం సిరీస్ Poco F8 ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో Poco F8 Ultra, Poco F8 Pro మోడళ్లు ఉన్నాయి. అల్ట్రా మోడల్‌లో అత్యంత శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగించగా, Pro వెర్షన్‌లో గత తరం Snapdragon 8 Elite SoC ఇవ్వబడింది. రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 16 ఆధారంగా HyperOS 3 పై పనిచేస్తాయి. అదనంగా బోస్ (Bose) కంపెనీ ట్యూన్ చేసిన స్పీకర్లతో హై-క్వాలిటీ ఆడియో అనుభవం అందించనున్నాయి.

Snapdragon 8 Gen 5 SoCతో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్‌గా OnePlus 15R.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్లు ఇదిగో..!

Poco F8 అల్ట్రా మోడల్ 6.9 అంగుళాల OLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఈ మొబైల్ 120Hz రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్ బ్రైట్‌నెస్, HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ లభిస్తాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో కూడిన ఈ ఫోన్ 16GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజ్‌ను అందిస్తుంది. కెమెరా విభాగంలో 50MP OIS ప్రైమరీ లెన్స్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో (5x ఆప్టికల్ జూమ్), 50MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్‌లో 32MP కెమెరా ఉంది. ఇక 6,500mAh బ్యాటరీకి 100W హైపర్ ఛార్జ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NavIC వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

మరోవైపు Poco F8 ప్రో మోడల్ 6.59 అంగుళాల AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్, 3,500 నైట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. Snapdragon 8 Elite SoC, 12GB RAM, 512GB స్టోరేజ్ ఆప్షన్‌లతో వస్తుంది. కెమెరా విభాగంలో 50MP OIS ప్రైమరీ సెన్సార్, 50MP 2.5x జూమ్ టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాగా 20MP సెన్సార్ ఉంది. అలాగే ఇందులో 6,210mAh బ్యాటరీ 100W వైర్డ్ HyperCharge, 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. అదనంగా ఈ మోడల్ IP68 రేటింగ్స్ తో ధూళి, నీటి నిరోధకతను కలిగి ఉంది.

పోకో నుండి సర్‌ప్రైజ్.. Poco Pad X1, Pad M1 గ్లోబల్‌గా లాంచ్.. ధరలు, స్పెసిఫికేషన్లు ఇవే..!

Poco F8 అల్ట్రా ధర 12GB + 256GB వేరియంట్‌కు $729 (రూ.65,100) నుంచి ప్రారంభమవుతుంది. ఇక 16GB + 512GB మోడల్ ధర $799 (రూ.71,300) గా నిర్ణయించారు. ఎర్లీ బర్డ్ ఆఫర్‌లో 12GB + 256GB వేరియంట్‌ $679 (60,600), 16GB + 512GB మోడల్ $729 (₹65,100)కి లభ్యమవుతాయి. Poco F8 Pro ధర 12GB + 256GB వేరియంట్‌కు $579 (రూ. 51,700), 12GB + 512GB మోడల్‌కు $629 (రూ.56,100). ఎర్లీ బర్డ్ ఆఫర్‌లో ఈ ధరలు $529 (47,200), $579 (51,700)గా ఉంటాయి. తొలి ఆరు నెలల్లో ఒకసారి ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ కూడా లభిస్తుంది.

Exit mobile version