NTV Telugu Site icon

Phone Charging : ఫోన్ ను చార్జింగ్ పెట్టేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.. లేకుంటే పేలిపోతుంది..!

Phone Charge

Phone Charge

ఈరోజుల్లో ఫోన్ లేకుండా ఎవ్వరు ఉండరు.. ఏం పనిలేకున్నా సోషల్ మీడియాలో ఎక్కువ గడుపుతుంటారు.. దాంతో ఫోన్ చార్జింగ్ త్వరగా అయిపోతుంది.. కొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేవరకు ఉంచి, ఆ తర్వాత చార్జింగ్ పెడతారు.. అలా చెయ్యడం తప్పు అని నిపుణులు అంటున్నారు.. అయితే ఫోన్ కు చార్జింగ్ పెట్టినప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక లుక్ వేద్దాం పదండి..

* ఎప్పుడూ మీ ఫోన్‌ను దాని స్వంత ఛార్జర్‌తోనే ఛార్జ్ చేయండి. స్మార్ట్‌ఫోన్‌లో యూనివర్సల్ ఛార్జింగ్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. మీరు తప్పు ఛార్జర్‌తో ఛార్జ్ చేస్తే, మీ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే ఒరిజినల్ ఛార్జర్‌తో మాత్రమే స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు..

* వేరే ఫోన్ ఛార్జర్ లేదా లోకల్ ఛార్జర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడూ ఛార్జ్ చేయకూడదు. మీరు ఒరిజినల్ అడాప్టర్ బదులు.. లోకల్‌ తయారీది ఏదైనా ఉపయోగిస్తే, మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ దెబ్బతినడం ఖాయం..అందుకే దాని ఛార్జర్ తోనే చార్జింగ్ పెట్టడం మంచిదని మర్చిపోకండి..

* స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు, మీ ఫోన్ కవర్‌ను వేరు చేయండి. స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేసినప్పుడు, అది వేడెక్కుతుంది. ప్రొటెక్షన్ కవర్ కారణంగా ఈ హీట్ బయటకు రాదు. దాని వల్ల ఫోన్ బ్యాటరీ పాడైపోతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు..

* ఇకపోతే స్మార్ట్‌ఫోన్‌కు ఫాస్ట్ ఛార్జర్ మంచి ఎంపిక అని మీరు అనుకుంటే, పొరపాటే. ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోని బ్యాటరీ భిన్నంగా ఉంటుంది. అందుకే కంపెనీ బ్యాటరీని బట్టి ఛార్జర్ ఇస్తుంది, ఫాస్ట్ ఛార్జర్‌ని సపోర్ట్ చేసే బ్యాటరీలను ఫాస్ట్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయాలి. సాధారణ ఛార్జర్‌ను సపోర్ట్ చేసే మొబైల్స్‌ని సాధారణ ఛార్జర్‌తో ఛార్జ్ చేయాలి..

* రాత్రిపూట ఛార్జింగ్ పెట్టి వదిలేస్తే అది అతిపెద్ద తప్పు అవుతుంది. సాధారణ ఫోన్‌ ఛార్జ్ అయ్యేందుకు 2 గంటల సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్‌తో ఛార్జ్ చేసే ఫోన్ 45 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అందుకే రాత్రంతా మీ ఫోన్‌ని ఛార్జింగ్ పోర్ట్‌లో ఉంచవద్దు.. ఫోన్ బ్యాటరీ పాడై పోతుంది లేదా బ్లాస్ట్ అవుతుంది.. ఇది గుర్తుంచుకోండి..