144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Pad 5 Pro Launch: ఒప్పో (OPPO) సంస్థ నుండి కొత్తగా ప్రీమియం టాబ్లెట్ ఒప్పో ప్యాడ్ 5 ప్రో (OPPO Pad 5 Pro)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఎంటర్టైన్మెంట్తో పాటు ప్రొడక్టివిటీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ టాబ్లెట్ భారీ డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీతో రూపొందింది.
డిస్ప్లే, ఆడియో:
OPPO Pad 5 Proలో 13.2 అంగుళాల 3.4K రిజల్యూషన్ ఉన్న హై క్వాలిటీ డిస్ప్లేను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్, వీడియో ప్లేబ్యాక్ చాలా స్మూత్‌గా ఉంటుంది. 1000 నిట్స్ బ్రైట్నెస్, 1500:1 కాంట్రాస్ట్ రేషియోతో పాటు ΔE≈0.7 కలర్ యాక్యురసీ ఉండటం వల్ల ప్రొఫెషనల్ స్థాయి విజువల్ అనుభవం లభిస్తుంది. ఇంకా ఇందులో డాల్బీ విజన్, HDR Vivid, ZREAL సపోర్ట్‌తో కంటెంట్ మరింత రిచ్‌గా కనిపిస్తుంది. అలాగే 8 స్పీకర్ల Hi-Fi ఆడియో సిస్టమ్ వల్ల సౌండ్ కూడా థియేటర్ లెవల్లో ఉంటుంది.
Also Read
- 16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
- Lava Bold N4 Lite: లావా బోల్డ్ N4 లైట్ భారత్‌లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 13MP కెమెరా, MIL-STD-810H రేటింగ్
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
- 6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
Abhishek Sharma-POM: ఈరోజు మైదానంలో లేదు, బాధగా ఉంది.. ఈ ఇన్నింగ్స్ ఆమెకు అంకితం!
పవర్ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ:
ఈ టాబ్లెట్‌లో Snapdragon 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. హైఎండ్ గేమింగ్, హెవీ యాప్‌లు సులభంగా రన్ అవుతాయి. ఇది బెంచ్‌మార్క్ టెస్ట్ లో 4.47 మిలియన్‌కు పైగా స్కోర్ సాధించింది. గేమింగ్ విషయంలో కూడా ఈ టాబ్లెట్ ప్రత్యేకమే అని చెప్పాలి. 3.4K రిజల్యూషన్‌లో 144FPS వరకు స్టేబుల్‌గా గేమ్స్ ఆడే సామర్థ్యం ఉంది. ఇందులో 13,380mAh భారీ బ్యాటరీ ఉండగా, 16 గంటల వరకు సోషల్ మీడియా స్ట్రీమింగ్ లేదా 20 గంటల వీడియో ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

సాఫ్ట్వేర్, ప్రొడక్టివిటీ ఫీచర్లు:
ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్OS 16తో వస్తుంది. మల్టీ విండో సపోర్ట్, ఫ్రీ ఫ్లోటింగ్ విండో ఫీచర్లతో మల్టీటాస్కింగ్ చాలా సులభం. PC లెవల్ WPS ఆఫీస్ సపోర్ట్ ఉండటం వల్ల డాక్యుమెంట్ వర్క్ కూడా సులభంగా చేయవచ్చు. కంప్యూటర్‌కు సెకండరీ స్క్రీన్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. కొత్త ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఫైల్స్‌ను యాప్‌ల వారీగా సులభంగా నిర్వహించవచ్చు. వీడియో ఎడిటింగ్ కోసం CapCut Pro సపోర్ట్ కూడా ఉంది. 10GB వీడియోను కేవలం 0.8 సెకండ్లలో ఇంపోర్ట్ చేయగలగడం, 30 నిమిషాల 4K వీడియోను తక్కువ సమయంలో ఎక్స్పోర్ట్ చేయగలగడం ఈ టాబ్లెట్ ప్రత్యేకత.
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
కెమెరా, ఇతర ఫీచర్లు:
OPPO Pad 5 Proలో 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Wi-Fi 7, Bluetooth 6.0, USB Type-C వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ టాబ్లెట్ బరువు 672 గ్రాములు కాగా, స్లిమ్ డిజైన్‌తో కేవలం 5.94mm మందంతో రూపొందించారు. చైనాలో ఈ టాబ్లెట్ ధరలు ఇలా ఉన్నాయి..
* 8GB+256GB – రూ. 58,920
* 12GB+256GB – రూ. 61,670
* 12GB+512GB – రూ. 68,530
* 16GB+512GB – రూ. 75,370
అదనంగా ఫ్లోటింగ్ కీబోర్డ్, స్టైలస్ (Pencil 3 సిరీస్), ప్రొటెక్టివ్ కేస్ వంటి యాక్సెసరీలు కూడా లభిస్తాయి. OPPO Pad 5 Pro ఏప్రిల్ 24 నుంచి చైనాలో సేల్కు రానుంది.
తాజావార్తలు
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!