OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే

  • ఒప్పో ఫైండ్ X9s
  • 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ
  • 12GB RAM + 256GB స్టోరేజ్ రూ.79,999.
Oppo Find X9s

Oppo Find X9s

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ OPPO తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OPPO Find X9s ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. శక్తివంతమైన డైమెన్సిటీ 9500s చిప్‌సెట్, 120Hz AMOLED డిస్‌ప్లే, 7025mAh భారీ బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఒప్పో ఫైండ్ X9s రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 12GB RAM + 256GB స్టోరేజ్ రూ.79,999. 12GB RAM + 512GB స్టోరేజ్ రూ.89,999.

ఈ ఫోన్ మిడ్‌నైట్ గ్రే, లావెండర్ స్కై, సన్‌సెట్ ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను OPPO India Official Store, Amazon India, Flipkart ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. అమ్మకాలు మే 28 నుంచి ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్‌లో భాగంగా మే 14 నుంచి మే 27 మధ్య ప్రీ-బుక్ చేసుకునే వినియోగదారులకు ఉచిత ప్రీమియం గిఫ్ట్ బాక్స్‌ను కంపెనీ అందిస్తోంది.

ఒప్పో ఫైండ్ X9sలో 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు.

రిజల్యూషన్: 2760 × 1256 పిక్సెల్స్
రిఫ్రెష్ రేట్: 120Hz
PWM డిమ్మింగ్: 3840Hz
గరిష్ట బ్రైట్‌నెస్: 3600 నిట్స్

డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ ఫోన్ ఆక్టా-కోర్ MediaTek Dimensity 9500s ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం Immortalis G925 MC12 GPUను ఉపయోగించారు. 12GB LPDDR5X RAM 256GB / 512GB UFS 4.1 స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ Android 16 ఆధారిత ColorOS 16పై పనిచేస్తుంది. ఒప్పో ఫైండ్ X9sలో 7025mAh భారీ బ్యాటరీ ఉంది. 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. 50MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో), 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (OISతో). సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఇన్-డిస్‌ప్లే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP66 + IP68 + IP69 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్, 5G, Wi-Fi 7, Bluetooth 6.1,GPS, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి.