OPPO Find X9 Ultra: 200MP కెమెరా, 7050mAh బ్యాటరీతో.. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా రిలీజ్

  • ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా రిలీజ్
  • 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,69,999
  • 7050mAh భారీ బ్యాటరీ
Oppo Find X9 Ultra

Oppo Find X9 Ultra

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OPPO Find X9 Ultra ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌లో 200-మెగాపిక్సెల్ కెమెరా, 7050mAh భారీ బ్యాటరీ, శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ వంటి ప్రీమియం స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,69,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ కాన్యన్ ఆరెంజ్, టండ్రా అంబర్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.

ఈ ఫోన్‌ను Amazon India, Flipkart, OPPO India Official Store ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్ చేసిన వినియోగదారులకు రూ.11,000 విలువైన ప్రీమియం గిఫ్ట్ బాక్స్‌ను కంపెనీ అందిస్తోంది.

ఇందులో:

ఒప్పో ఎంకో ఎయిర్ 5 ప్రో TWS ఇయర్‌బడ్స్
అధికారిక ప్రొటెక్టివ్ కవర్ కేస్ ఉంటాయి. ఈ ఆఫర్ మే 14 నుంచి మే 27 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు వర్తిస్తుంది.

ఒప్పో ఫైండ్ X9 అల్ట్రాలో 6.82 అంగుళాల QHD+ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేను అందించారు.
రిజల్యూషన్: 1440×3168 పిక్సెల్స్
రిఫ్రెష్ రేట్: 120Hz
గరిష్ట బ్రైట్‌నెస్: 1800 నిట్స్

డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఇచ్చారు.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16పై పనిచేస్తుంది. ఇందులో అడ్రినో 840 GPUతో కూడిన Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 16GB వరకు LPDDR5X RAM, 16GB వరకు UFS 4.1 స్టోరేజ్ సపోర్ట్ అందించారు.

భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్

ఈ ఫోన్‌లో 7050mAh భారీ బ్యాటరీ ఉంది. 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ఇచ్చారు:
200MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో)
50MP అల్ట్రా వైడ్ కెమెరా
200MP టెలిఫోటో కెమెరా
50MP అల్ట్రా టెలిఫోటో కెమెరా

సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందించారు.

కనెక్టివిటీ & భద్రత

ఈ స్మార్ట్‌ఫోన్‌లో:

Wi-Fi 7
బ్లూటూత్ 6.0
NFC
GPS
USB Type-C పోర్ట్ లభిస్తాయి.

భద్రత కోసం 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు.