Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!

  • Oppo F35 Series భారత్‌లో లాంచ్
  • 8,000mAh బ్యాటరీతో వచ్చిన కొత్త ఫోన్ల ధరలు ఇవే
Oppo F35, F35 Pro

Oppo F35, F35 Pro

Oppo F35, F35 Pro Launched in India: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒప్పో మరో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. Oppo F35, Oppo F35 Pro పేరుతో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. భారీ 8,000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు AMOLED డిస్‌ప్లే, MediaTek Dimensity ప్రాసెసర్, 50MP కెమెరా వంటి ఫీచర్లను ఈ ఫోన్లలో అందించారు. భారత్‌లో Oppo F సిరీస్‌కు 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్లను కంపెనీ తీసుకొచ్చింది. Oppo F35 Pro చైనాలో లాంచ్ అయిన Oppo A7 Pro Maxకు రీబ్రాండెడ్ మోడల్‌గా వచ్చినట్లు సమాచారం. అయితే భారత మార్కెట్‌లో చైనీస్ వేరియంట్‌లో ఉన్న 10,000mAh బ్యాటరీకి బదులుగా 8,000mAh బ్యాటరీని అందించారు.

Oppo F35 Pro ధర ఎంత?

Oppo F35 Proను భారత్‌లో మూడు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ చేశారు.

6GB RAM + 128GB: రూ.45,999
8GB RAM + 128GB: రూ.49,999
8GB RAM + 256GB: రూ.54,999

ఈ ఫోన్ Sunrise Orange, Wave Blue, Twilight Brown కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Oppo F35 ధర ఎంత?

Oppo F35 రెండు స్టోరేజ్ వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది.

6GB RAM + 128GB: రూ.38,999
8GB RAM + 128GB: రూ.42,999

ఈ ఫోన్‌ను Wave Blue, Titanium Grey, Mist Pink కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ఫోన్ల విక్రయాలు అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. Flipkart, Amazonతో పాటు Oppo అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Oppo F35 Pro డిస్‌ప్లే

Oppo F35 Proలో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే అందించారు. ఈ స్క్రీన్ 2.5D ప్రొటెక్షన్‌తో వస్తుంది. అలాగే 144Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. మరోవైపు Oppo F35లో 6.57 అంగుళాల FHD డిస్‌ప్లే ఉంది. దీనికి కూడా 2.5D ప్రొటెక్షన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,400 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉన్నాయి. పనితీరు కోసం Oppo F35 Proలో MediaTek Dimensity 7360 Max చిప్‌సెట్‌ను అందించారు. Oppo F35లో MediaTek Dimensity 6360 Max ప్రాసెసర్ ఉంది. రెండు ఫోన్లు 8GB వరకు RAMతో వస్తాయి. F35 Proలో 256GB వరకు స్టోరేజ్, F35లో 128GB వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఈ రెండు ఫోన్లు Android 16 ఆధారిత ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి.

50MP కెమెరాతో Oppo F35 సిరీస్

కెమెరాల విషయానికి వస్తే Oppo F35 Pro వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, OIS సపోర్ట్‌తో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా అందించారు. Oppo F35లో 50MP మెయిన్ కెమెరా + 2MP పోర్ట్రెయిట్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం రెండు ఫోన్లలోనూ 50MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 8,000mAh బ్యాటరీ.. 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఈ రెండు ఫోన్లలో ప్రధాన ఆకర్షణ భారీ బ్యాటరీ. Oppo F35, F35 Pro రెండింటిలోనూ 8,000mAh బ్యాటరీ ఉంది. దీంతో ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించాలనుకునే వారికి ఇవి ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసేందుకు 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు.

Oppo F35 సిరీస్‌లోని రెండు ఫోన్లకు IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో దుమ్ము, నీటి నుంచి ఫోన్లకు మెరుగైన రక్షణ లభించేలా వీటిని రూపొందించారు. కనెక్టివిటీ కోసం Wi-Fi, Bluetooth, NFC వంటి ఫీచర్లను కూడా అందించారు.