Oppo F31 series: ఒప్పో (Oppo) ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నాణ్యత, డిజైన్, మంచి కెమెరా సామర్థ్యాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఒప్పో ఫోన్‌లు సాధారణ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్స్, మంచి డ్యూరబిలిటీని అందించడం ప్రత్యేకత. వివోలో ఎక్కువగా F సిరీస్ లాంటి లైన్‌ప్‌లు యూత్‌లో బాగా ప్రసిద్ధి పొందాయి. ఈ నేపథ్యంలోనే.. Oppo F29 సిరీస్ అనుసరించి Oppo F31 సిరీస్ కూడా అభివృద్ధి అవుతోంది. లీకైన సమాచారం ప్రకారం ఈ సిరీస్ సెప్టెంబర్ 2025లో ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ సిరీస్‌లో Oppo F31, Oppo F31 Pro అనే రెండు మోడల్స్ ఉంటాయని తెలుస్తోంది.
Virat Kohli: లండన్ వీధుల్లో భార్యతో కలిసి స్వేచ్ఛగా షికార్లు కొడుతున్న కోహ్లీ.. వీడియో వైరల్
ఈ Oppo F31 సిరీస్ ప్రధాన హైలైట్ 7,000mAh భారీ బ్యాటరీ. F29 సిరీస్‌లోని Oppo F29 కి 6,500mAh, F29 Pro కి 6,000mAh బ్యాటరీ ఉన్నందున ఇది అసలైన అప్‌గ్రేడ్ అవుతుంది. దీని ఫలితంగా లాంగ్-లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ వినియోగదారులకు అందుతుంది. మరోవైపు ఈ Oppo F31 సిరీస్ 360-డిగ్రీ ఆర్మర్ బాడీతో వస్తుందని సమాచారం. F29 సిరీస్‌లో అల్యూమినియం అలోయ్ మదర్‌బోర్డు కవర్, డైమండ్-కట్ కార్నర్లు, ఇంపాక్ట్-అబ్సార్బింగ్ ఎయిర్‌బ్యాగ్స్ తో డ్రాప్ ప్రొటెక్షన్ కల్పించేది. Oppo F31 సిరీస్ కూడా ఇదే ట్రెండ్ కొనసాగించనుంది.
UP: మీరట్‌లో దారుణం.. జవాన్‌ను స్తంభానికి కట్టేసి చావబాదిన టోల్ సిబ్బంది
ఈ సిరీస్‌లో హంటర్ యాంటెనా లేఅవుట్ ద్వారా సిగ్నల్ స్ట్రెంత్ 300 శాతం వరకు పెరగవచ్చని సమాచారం. అలాగే, ఫోన్ 4-చానెల్ రిసెప్షన్ తో అత్యుత్తమ నెట్‌వర్క్‌కు ఆటోమేటిక్‌గా స్విచ్ అవుతుంది. దీని వల్ల సిగ్నల్ డ్రాప్ సమస్యను తగ్గిస్తుంది. అయితే కెమెరా, చిప్‌సెట్ లలో పెద్ద అప్‌గ్రేడ్‌లు లేకపోవచ్చని F29 సిరీస్ నుండి ఆ ఫీచర్స్ సమానంగా ఉంటాయని సమాచారం. కాబట్టి Oppo F31 సిరీస్ ఎక్కువగా పథ ఫీచర్ల అప్గ్రేడ్ గా ఉంటుంది. మొత్తంగా Oppo F31 సిరీస్ పెర్ఫార్మన్స్, డ్యూరబిలిటీ, భారీ బ్యాటరీ ఫీచర్లతో మార్కెట్లో యూత్ వినియోగదారులకు ఆకర్షణీయంగా మారనుంది.
