OpenAI vs Anthropic: ప్రధాని మోడీ ముందే.. ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ ఏఐ సీఈవోల మధ్య రగడ..

Openai Vs Anthropic

Openai Vs Anthropic

OpenAI vs Anthropic: ఓపెన్ ఏఐ vs ఆంథ్రోపిక్ ఏఐ మధ్య వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా భారత్‌లో జరిగిన ఏఐ ప్రభావ సదస్సులు ఈ ఇద్దరి సీఈవోల మధ్య రగడ కనిపించింది. గ్రూప్ ఫోటో తీసుకునే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)తో పాటు వేదికపై ఉన్న టెక్నాలజీ రంగ ప్రముఖులు అందరూ ఒకరికొకరు చేతులు కలిపి పైకి ఎత్తారు. ఐక్యతకు గుర్తుగా తీసుకున్న ఈ ఫొటోలో మాత్రం ఇద్దరు ప్రముఖులు భిన్నంగా కనిపించారు. ఈ ఇద్దరే ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ (Sam Altman), ఆంథ్రోపిక్ ఏఐ డారియో అమోడెయ్ (Dario Amodei). అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని పైకి లేపితే.. ఈ ఇద్దరు మాత్రం తమ తమ చేతులను విడిగా పైకి ఎత్తారు. ఆ చిన్న తేడా కెమెరాలో చిక్కింది. వెంటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కట్ చేస్తే.. నిమిషాల్లోనే వీటిపై అనేక జోకులు, ట్రోల్స్ బయటకు వచ్చాయి. కొందరు ఈ సన్నివేశాన్ని సరదగా తీసుకున్నారు. మరికొందరు దీని వెనుక అసలు కథ గురించి శోధిస్తున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరి మధ్య ఉన్న వృత్తిపరమైన పోటీ గురించి ఇప్పటికే టెక్నాలజీ ప్రపంచంలో చర్చ ఉంది.

READ MORE: Pakistan Cricket: బాబర్‌ను తీసేయాలని చెప్తే, నన్నే తీసేశారు.. పాక్ మాజీ సంచలన వ్యాఖ్యలు..

×
×
Ad

ప్రస్తుతం OpenAI సంస్థ వేగంగా కొత్త ఉత్పత్తులను తీసుకురావడం, ఎక్కువ మందిని ఆకట్టుకునేలా ముందడుగు వేస్తోంది. మరోవైపు Anthropic సంస్థ సైతం భద్రత, బాధ్యతతో వినియోగం వంటి అంశాలపై దృష్టి పెడుతోంది. ఈ రెండు సంస్థల ఆలోచనలు, ఈ కంపెనీల సీఈవోల మధ్య ఉన్న వ్యత్యాసాలు ఆ ఫొటోలో కనిపించాయని చాలా మంది అనుకుంటున్నారు. డారియో అమోడెయ్ ఒకప్పుడు ఓపెన్‌ఏఐలోనే పని చేశారు. ఏఐ వృద్ధిలో తోడ్పాటునందించారు. అక్కడి నుంచి బయటకు వచ్చి తనతో పనిచేసిన కొంతమందితో కలిసి కొత్త సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ రెండు సంస్థలు ఏఐ రంగంలో గట్టి పోటీదారులుగా మారాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ సంఘటనను కొందరు “ఏఐ కోల్డ్ వార్” అని వ్యాఖ్యానించారు. ఇంకొందరు మాత్రం ఇది కేవలం ఒక సాధారణ క్షణమే తప్ప దీనికి అంత అర్థం వెతకాల్సిన అవసరం లేదంటున్నారు.

READ MORE: Kim: న*గ్నంగా ఊరేగించాడు.. సొంత మామనే కుక్కలతో కరిపించి చంపాడు.. కిమ్‌ కిరాతకం!