Atlas: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతోంది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. అయితే మొదటిసారి ఏఐ ఎక్కువగా ప్రాచుర్యం వచ్చింది మాత్రం చాట్‌జీపీటీ వల్లే అని చెప్పాలి. ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన ఈ చాట్‌జీపీటీ సెర్చ్ ఇంజన్‌లో సరికొత్త ఒరవడిని సృష్టించింది. ఎలాంటి ప్రశ్న అడిగా వెంటనే సమాధానం చెప్పడం ఈ చాట్‌జీపీటీ ప్రత్యేకత. అయితే.. ఈ ఏఐ తాజాగా సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. AI ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చేస్తున్న OpenAI, “అట్లాస్” అనే కొత్త వెబ్ బ్రౌజర్‌ను ప్రారంభించింది. ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే గూగుల్ క్రోమ్‌తో పోటీ పడేందుకు “అట్లాస్”ను ఆవిష్కరించింది.
READ MORE: Intermediate Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్.. 26 మార్కులు వస్తే పాస్
వాస్తవానికి.. ChatGPT విజయవంతం అయినప్పటికీ.. ఆ కంపెనీ ఇంకా గణనీయమైన లాభాలను ఆర్జించలేదు. దాదాపు 800 మిలియన్ల మంది దీనిని ఉపయోగిస్తున్నారు. అందులో ఎక్కువ శాతం మంది ఉచిత వినియోగదారులే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదాయం పెంచుకునేందుకు అట్లాస్‌ను ప్రారంభించిందని చెబుతున్నారు. మొదట ఈ బ్రౌజర్ ఆపిల్ ల్యాప్‌టాప్‌లలో అందుబాటులోకి వస్తుంది. త్వరలో ఇది విండోస్, ఐఫోన్, ఆండ్రాయిడ్‌లలో కూడా ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ అట్లాస్ బ్రౌజర్ ప్రత్యేకతలు తెలిపారు. బ్రౌజర్ అంటే ఏమిటి, దానిని ఎలా ఉపయోగించవచ్చో ప్రజలు పునరాలోచించుకునే అవకాశం ఉంటుందన్నారు. సాంప్రదాయ “URL బార్”ని ఇప్పుడు AI చాట్ ఇంటర్‌ఫేస్ ద్వారా భర్తీ చేయవచ్చని వెల్లడించారు.
READ MORE: Sanjay Roy: ఆర్జీ కర్ హత్యాచార దోషి ఇంట్లో చిన్నారి మృతదేహం కలకలం.. పోలీసుల దర్యాప్తు
అట్లాస్ ప్రత్యేకత ఏమిటి?
అట్లాస్ మూడు కీలక లక్షణాలను కలిగి ఉంది. ముందుగా, మీరు ఏ పేజీని ఓపెన్ చేసిన వెబ్‌పేజీ పక్కన ChatGPT సైడ్‌బార్ కనిపిస్తుంది. ఇది వినియోగదారులకు కంటెంట్ ఇవ్వడానికి, డేటాను విశ్లేషించడానికి సహాయపడుతుంది. ఈ బ్రౌజర్ “కర్సర్ చాట్” ఫీచర్ వినియోగదారులు ఇమెయిల్‌లు లేదా పత్రాలలో పేరాలను హైలైట్ చేయడానికి, దానిని ఇన్‌లైన్‌లో పాలిష్ చేయడానికి లేదా సవరించడానికి తక్షణమే ChatGPTని సంప్రదించడానికి అవకాశం ఉంటుంది. రెండవది: అట్లాస్‌లో బ్రౌజర్ హిస్టరీ ఉంది. కస్టమర్లు వినియోగించే సైట్‌ల నుంచి వివరాలను గుర్తుంచుకోవడానికి ChatGPTని అనుమతించే ఆప్షన్ ఉంది. అంటే గత కొన్ని రోజులుగా మీరు చూసిన అన్ని ఉద్యోగ పోస్టింగ్‌లను కనుక్కుని ఆయా పరిశ్రమ ట్రెండ్‌ల సారాంశాన్ని సృష్టించమని బ్రౌజర్‌ను అభ్యర్థించే అవకాశం ఉంది. మీ హిస్టరీని ఎప్పుడైనా చూడొచ్చు. లేదా డిలీట్ సైతం చేయడానికి అవకాశం ఉంటుంది. మూడవది: ప్లస్, ప్రో, బిజినెస్ వినియోగదారుల కోసం ప్రివ్యూలో బ్రౌజర్ ఏజెంట్ మోడ్ అందుబాటులో ఉంది. ఇది బుకింగ్ రిజర్వేషన్లు, వస్తువులను కొనుగోలు చేయడం, పరిశోధనలు నిర్వహించడం వంటి కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. అట్లాస్ ప్రారంభం AIలో సంచలనం సృష్టించే అవకాశం ఉంది. తాజాగా బ్రౌజర్ ప్రకటన తర్వాత Google స్టాక్ 3% పడిపోయింది. ఇది Chrome దీర్ఘకాల ఆధిపత్యానికి ముప్పుగా మారుతుందని చెబుతున్నారు. క్రోమ్ పెట్టుబడిదారుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.
