NTV Telugu Site icon

OnePlus Watch 2 Launch : వన్ ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్.. ధర, ఫీచర్స్?

One Plus

One Plus

ప్రముఖ ఎలెక్ట్రానిక్ కంపెనీ వన్ ప్లస్ నుంచి వచ్చిన ప్రతి ప్రాడక్ట్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఇప్పుడు తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చెయ్యనుంది.. ఈ వాచ్ ల పై ఆసక్తి కలిగిన వారు కేవలం రూ. 99 రూపాయలు మాత్రమే చెల్లించి బుక్ చేసుకోవచ్చు.. . 1,000 డిస్కౌంట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో ఉచిత బుల్లెట్ వైర్‌లెస్ Z2 ఇయర్‌బడ్‌లను కూడా పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్స్ ను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫీచర్స్ విషయానికొస్తే.. వన్‌ప్లస్ వాచ్ 2 సప్పైర్ క్రిస్టల్‌తో 1.43-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. అయితే, ఈ స్మార్ట్ వాచ్ 2 మోడల్ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ డబ్ల్యూ5 జనరేషన్ 1 చిప్‌సెట్‌లో రన్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు.. గూగుల్ ప్లాట్‌ఫారమ్‌ను ఇందులో ఉపయోగిస్తుంది.. అదిరిపోయే ఫీచర్స్ ను కలిగి ఉన్న ఈ వాచ్ రేడియంట్ స్టీల్, బ్లాక్ స్టీల్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ రెండు వేరియంట్‌లు సిలికాన్ వాచ్ బెల్ట్‌లతో స్టెయిన్‌లెస్ స్టీల్ కేసులను కలిగి ఉంటాయని తెలుస్తుంది..

ఈ స్మార్ట్ మోడ్‌లో వాచ్ 2 బ్యాటరీ లైఫ్ 100 గంటల వరకు ఉంటుంది. స్మార్ట్ మోడ్‌లో గరిష్టంగా 100-గంటల బ్యాటరీ లైఫ్‌తో రానుంది. వన్‌ప్లస్ వాచ్ మీ జీవితానికి అంతరాయం లేకుండా ఉండేలా చేస్తుందని వన్‌ప్లస్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వన్ ప్లస్ వాచ్ 2 సిరీస్ కెమెరా డెకోను రీసౌండ్ రౌండ్ వాచ్ ఫేస్‌ను కలిగి ఉంది.. ఈ సేల్ కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని తెలుస్తుంది.. గతంలో వచ్చిన స్మార్ట్ వాచ్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.. ఈ వాచ్ లకి డిమాండ్ ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు..