3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus Pad 4 Launched: వన్ ప్లస్ (OnePlus) నుండి భారత మార్కెట్లో కొత్త ఫ్లాగ్షిప్ టాబ్లెట్ వన్ ప్లస్ ప్యాడ్ 4 (OnePlus Pad 4)ను అధికారికంగా లాంచ్ చేసింది. “Exceptional Without Exception” అనే నినాదంతో వచ్చిన ఈ డివైస్.. ఎంటర్టైన్మెంట్ అండ్ ప్రాడక్టివిటీ మధ్య గ్యాప్‌ను తగ్గించేలా రూపొందించబడింది.
స్లిమ్ & ప్రీమియం లుక్:
OnePlus Pad 4 అత్యంత సన్నని మెటల్ యూనిబాడీ డిజైన్‌తో వస్తుంది. కేవలం 5.94mm మందంతో, 672 గ్రాముల బరువుతో ఇది సులభంగా తీసుకెళ్లగలిగేలా రూపొందించారు. ఇండియాలో ఇది డునె గ్లో (బ్రాంజ్ టిటానియం లుక్), సాగె మిస్ట్ (ఫ్రాస్టెడ్ గ్రీన్) అనే రెండు స్టైలిష్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
Also Read
- పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై 'Telegram'కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
- Dell Alienware 15: డెల్ ఏలియన్‌వేర్ 15 గేమింగ్ ల్యాప్‌టాప్ భారత్‌లో విడుదల.. RTX 4050 GPU, AMD Ryzen ప్రాసెసర్
- Nokia 235 4G: AI అసిస్టెంట్ బటన్‌తో నోకియా కొత్త 4G ఫీచర్ ఫోన్లు విడుదల.. 13 రోజుల బ్యాటరీ బ్యాకప్
- Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
పవర్ఫుల్ ప్రాసెసర్:
ఈ టాబ్లెట్‌లో Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది మంచి పనితీరును అందించడంతో పాటు AnTuTu స్కోర్ 4.1 మిలియన్‌కు పైగా సాధించింది. 8GB/12GB LPDDR5X RAM, 256GB/512GB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లతో ఫాస్ట్ అండ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలాగే క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీ ద్వారా హీట్‌ను నియంత్రిస్తూ గేమింగ్ సమయంలో కూడా పనితీరు నిలకడగా ఉంటుంది.

డిస్ప్లే & ఆడియో:
ఈ కొత్త టాబ్లెట్ లో 13.2 అంగుళాల 3.4K డిస్ప్లేతో, 144Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తుంది. 7:5 రీడ్ఫిట్ ఆస్పెక్ట్ రేషియో వల్ల బుక్ చదివిన అనుభూతి కలుగుతుంది. 8 స్పీకర్ సెటప్ (4 వూఫర్స్, 4 ట్వీటర్స్) ద్వారా సినిమాటిక్ ఆడియో ఎక్స్పీరియన్స్ లభిస్తుంది.
AI ఫీచర్లు & ప్రొడక్టివిటీ:
OxygenOS 16పై నడిచే ఈ టాబ్లెట్, AI రైటర్, AI సమ్మరీ, AI ట్రాన్సలేట్, AI పెయింటర్ వంటి ఆధునిక ఫీచర్లతో వస్తుంది. ఒకేసారి ఐదు విండోలను ఓపెన్ చేసి మల్టీటాస్కింగ్ చేయగల సామర్థ్యం ఉంది. OnePlus ఎకోసిస్టమ్‌లో ఫోన్‌తో స్క్రీన్ మిర్రరింగ్, క్లిప్‌బోర్డ్ షేరింగ్ వంటి ఫీచర్లు సులభంగా ఉపయోగించుకోవచ్చు.
బ్యాటరీ & కనెక్టివిటీ:
ఇందులో 13380mAh భారీ బ్యాటరీతో పాటు 67W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. Wi-Fi 7, బ్లూటూత్ 6.0 వంటి లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. OnePlus Stylo Pro (16,000 లెవల్స్ ప్రెషర్ సెన్సిటివిటీతో), స్మార్ట్ కీబోర్డు వేర్వేరుగా అందుబాటులో ఉంటాయి. ఇవి ప్రొడక్టివిటీని మరింత పెంచుతాయి.
ధర:
OnePlus Pad 4 ధర 8GB + 256GB మోడల్‌కు రూ.59,999 కాగా, 12GB + 512GB మోడల్ రూ.64,999గా నిర్ణయించారు. మే 5 నుంచి వన్ ప్లస్ అధికారిక వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వన్ ప్లస్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. ఎంచుకున్న బ్యాంక్ కార్డులతో రూ.5,000 వరకు డిస్కౌంట్, 6 నెలల నో-కాస్ట్ EMI, పరిమిత కాలం వరకు ఉచితంగా OnePlus Stylo Pro కూడా అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్‌లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!