NTV Telugu Site icon

OnePlus Open: వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్..ధర, ఫీచర్స్ ఇవే..!

Oneplus

Oneplus

ఐఫోన్ తో సమానంగా క్రేజ్ ను అందుకున్న కంపెనీ వన్ ప్లస్.. ఈ మొబైల్స్ కు కూడా మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంది.. తాజాగా మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేయబోతుంది.. వన్‌ప్లస్ నుంచి వస్తున్న మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్‌ వన్‌ప్లస్ ఓపెన్ చాలామందిలో ఆసక్తిని రేపుతోంది.. దీనికి సంబంధించి అనేక రూమర్స్ ఇప్పటికే బయటికి వచ్చి ఆసక్తిని మరింత పెంచేశాయి. ఈ మొబైల్ మొదటిసారిగా అనుష్క శర్మ చేతిలో కనిపించింది.. ఇక అదే ఫోన్ ను ఇండియాలో త్వరలోనే లాంచ్ చెయ్యనున్నట్లు కంపెనీ ప్రకటించింది.. ఇక ఆలస్యం ఎందుకు ఈ ఫోన్ ఫీచర్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ వన్‌ప్లస్ ఓపెన్ ఫోన్ మెయిన్ డిస్‌ప్లే లోపల ఉంటుంది. చైనీస్ సెమీకండక్టర్ డిస్‌ప్లే టెక్నాలజీ కంపెనీ BOE దీనిని తయారు చేసింది. 2K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది. డిస్‌ప్లే చాలా బ్రైట్‌గా ఉంటుందని, అలాగే స్మూత్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుందని చైనీస్ సోర్సెస్ తెలుపుతున్నాయి. వన్‌ప్లస్ ఓపెన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో హై పర్ఫామెన్స్ ఆఫర్ చెయ్యనుందని వార్తలు వినిపిస్తున్నాయి..

సెల్ఫీ ప్రియులకు ఈ ఫోన్ బెస్ట్ చాయిస్.. సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ బ్యాక్‌సైడ్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఇందులో 48-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 64-మెగాపిక్సెల్ జూమ్ కెమెరా, 48-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. జూమ్ కెమెరా ఏ మాత్రం క్వాలిటీ కోల్పోకుండా 6x వరకు జూమ్ చెయ్యగలదని టాక్..

ఇకపోతే ఓపెన్ 100W ఛార్జర్‌తో వస్తుంది, ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేయగలదు. అయితే, ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయదు. ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 13పై ఫోన్ రన్ అవుతుంది.. దీని బరువు 246 గ్రాములు ఉంటుందని టాక్..ఈ ఫోన్ ధర దాదాపు రూ.1,39,999గా ఉండొచ్చు, అక్టోబరు 27న అమ్మకానికి రావచ్చు. ఈ ధర టెక్నో ఫాంటమ్ V ఫోల్డ్ మొబైల్ కంటే ఖరీదైనది, దీని ధర రూ.88,888 కాగా శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5 కంటే చౌకైనది, దీని ధర రూ.1,54,999.. ఇండియాలో అక్టోబర్ 19 న రాత్రి 7.30 లకు ఆన్ లైన్ లో లాంచ్ చెయ్యనున్నారు..