Site icon NTV Telugu

54 గంటల బ్యాటరీ లైఫ్, AI ఫీచర్లతో OnePlus Nord Buds 3r లాంచ్!

Oneplus Nord Buds 3r

Oneplus Nord Buds 3r

OnePlus Nord Buds 3r: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తాజాగా భారత మార్కెట్లో కొత్త OnePlus Nord Buds 3r ను లాంచ్ చేసింది. ఈ కొత్త TWS హెడ్‌సెట్ మొత్తం 54 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ తెలుపుతుంది. కేవలం ఇయర్‌బడ్స్‌కే IP55 రేటింగ్ ఉండటం వల్ల అవి దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది. వీటితోపాటు ఇందులో 12.4mm టైటానియం డ్రైవర్లు, AI ఆధారిత నాయిస్ క్యాన్సిలేషన్, డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకత. వీటితోపాటు రియల్-టైమ్ AI ట్రాన్స్ లేషన్, 360-డిగ్రీ 3D ఆడియో, Find My Earbuds వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి.

Viral Video: ఢిల్లీ మెట్రోలో పొట్టుపొట్టు కొట్టుకున్న ఇద్దరు మహిళలు.. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఇక వీటి ధర విషయానికి వస్తే.. రూ.1,799 గా నిర్ణయించారు. అయితే ప్రత్యేక ఆఫర్ కింద పరిమిత కాలానికి రూ.200 ఆఫర్ ఇస్తూ కేవలం రూ.1,599కే లభిస్తుంది. ఇవి ఔరా బ్లూ, యాష్ బ్లాక్ కలర్స్ లో లభిస్తాయి. సెప్టెంబర్ 8 నుంచి వన్‌ప్లస్ ఇండియా e-store, వన్‌ప్లస్ స్టోర్ యాప్, వన్‌ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్రా, క్రోమా, రిలయన్స్, విజయ్ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ లతోపాటు ఇతర రిటైల్ స్టోర్లలో లభించనున్నాయి.

ఇక ఫీచర్ల పరంగా ఇందులో 12.4mm టైటానియం కోటెడ్ డైనమిక్ డ్రైవర్లతో మంచి ఆడియోని అందిస్తాయి. వినియోగదారులు Sound Master EQ ద్వారా మూడు ప్రీసెట్ EQ మోడ్‌ లను ఎంచుకోవచ్చు. అలా కాకపోయినా 6 బ్యాండ్ ఈక్వలైజర్‌తో తమకు నచ్చినట్లు ఆడియోను కస్టమైజ్ చేసుకోవచ్చు. OnePlus 3D ఆడియోతో 360-డిగ్రీ ఇమర్సివ్ సౌండ్ అనుభవం కలుగుతుంది.

జామ పండుతో వచ్చే అద్భుత ప్రయోజనాలు..ఆరోగ్య రహస్యాలు..

ఈ కొత్త ఇయర్ బడ్స్ డ్యూయల్ మైక్ సెటప్ AI సపోర్ట్ తో కలిసి వాయిస్ కాల్స్ సమయంలో నాయిస్ క్యాన్సిలేషన్ అందిస్తుంది. కనెక్టివిటీ విషయంలో Bluetooth 5.4, Google Fast Pair, డ్యూయల్ డివైస్ సపోర్ట్ ఉన్నాయి. గేమింగ్ కోసం 47ms తక్కువ లేటెన్సీ మోడ్ కూడా అందిస్తుంది. ట్యాప్ జెశ్చర్ ద్వారా వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ చేయవచ్చు. అలాగే Tap 2 Take ఫీచర్‌తో ఫోటోలు కూడా తీయవచ్చు. మాయతంగా ఇవి తక్కువ ధరకే వినియోగదారులకు ప్రీమియం ఆడియో అనుభవం అందించనున్నాయి.

Exit mobile version