Site icon NTV Telugu

OnePlus Nord 6 Launch: 9000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. మిడ్‌రేంజ్‌లో కొత్త బెంచ్‌మార్క్‌గా వన్‌ప్లస్‌ నార్డ్‌ 6!

Oneplus Nord 6 Launch

Oneplus Nord 6 Launch

OnePlus Nord CE 6 India Launch and Price: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్’ ఇటీవల చైనాలో తన కొత్త ‘టర్బో 6’ సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో వన్‌ప్లస్ టర్బో 6 (OnePlus Turbo 6), వన్‌ప్లస్ టర్బో 6వీ (Turbo 6V) స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. మిడ్‌రేంజ్ విభాగంలో విడుదలైన ఈ ఫోన్‌లలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది 9,000mAh బ్యాటరీ. ఇప్పటివరకు మెయిన్‌స్ట్రీమ్ స్మార్ట్‌ఫోన్‌లలో చూసిన బ్యాటరీలతో పోలిస్తే.. ఇది చాలా పెద్దది అనే చెప్పాలి. అంతేకాదు కొత్త క్వాల్‌కామ్ ప్రాసెసర్లు, మెరుగైన డ్యూరబిలిటీ, డస్ట్‌ అండ్ వాటర్ ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్లలో అందించారు. ఇప్పుడు అందరి దృష్టి ఈ ఫోన్ల గ్లోబల్, ఇండియా లాంచ్‌పైనే ఉంది. పలు రిపోర్టుల ప్రకారం.. వన్‌ప్లస్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను అంతర్జాతీయ మార్కెట్లలో నార్డ్‌ బ్రాండ్ కింద తీసుకురానుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 6 (OnePlus Nord 6), వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 6 (OnePlus Nord CE 6) రీబ్రాండెడ్ వెర్షన్‌లలో లాంచ్ అవుతాయి.

GSMArena రిపోర్ట్ ప్రకారం.. వన్‌ప్లస్‌ నార్డ్‌ 6 పలు గ్లోబల్ సర్టిఫికేషన్లను పొందింది. మలేషియా, యూఏఈలో అనుమతులు లభించాయి. సాధారణంగా ఈ ప్రక్రియ ఫోన్ అధికారిక లాంచ్‌కు కొన్ని వారాలు ముందు జరుగుతుంది. గతేడాది జూలైలో నార్డ్‌ 5 విడుదల కాగా.. ఈసారి నార్డ్‌ 6 మోడల్స్ 2026 ఆరంభంలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వన్‌ప్లస్ ఇప్పటివరకు అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. అయినా గతంలో టర్బో మోడళ్లను గ్లోబల్ మార్కెట్లలో రీబ్రాండ్ చేసింది. ఆ ప్రకారం నార్డ్‌ 6 కూడా రావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. వన్‌ప్లస్‌ నార్డ్‌ 6 గ్లోబల్ లాంచ్‌కు సిద్ధమవుతోందని తెలుస్తోంది. 2026 తొలి అర్ధభాగంలో ఇండియాతో పాటు ఇతర దేశాల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

చైనాలో వన్‌ప్లస్‌ టర్బో 6 ధర CNY 2,099 (సుమారు రూ.27,000), వన్‌ప్లస్‌ టర్బో 6వీ ధర CNY 1,699 (సుమారు రూ.21,000). ఈ రెండు ఫోన్స్ మిడ్‌రేంజ్ విభాగంలో ఉన్నాయి. అంచనాల ప్రకారం.. వన్‌ప్లస్‌ నార్డ్‌ 6 ధర రూ.28,000 నుంచి రూ.32,000 మధ్య ఉండవచ్చు. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 6 ధర రూ.22,000 నుంచి రూ.25,000 మధ్య ఉండే అవకాశముంది. రెండింటిలో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8s జెనెరేషన్ 4 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. ఇది నార్డ్‌ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన ఫోన్లలో అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్‌గా నిలవొచ్చు. ఈ ఫోన్‌లో 16జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజ్ ఉండొచ్చని సమాచారం. ఇందులో అత్యంత హైలైట్ బ్యాటరీనే. 9,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్లు ఉండనున్నాయి. ఇది మిడ్‌రేంజ్‌లో కొత్త బెంచ్‌మార్క్ అనే చెప్పాలి.

Also Read: Harmanpreet Kaur: అదే మా అసలైన బలం.. ముంబై విజయంపై హర్మన్‌ప్రీత్ ఆనందం!

వన్‌ప్లస్‌ నార్డ్‌ 6లో IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ ఉన్నాయి. ఇవి దుమ్ము, ధూళి, నీటి నుంచి రక్షణ ఇస్తుంది. నీటిలో మునిగినా, అధిక ప్రెషర్ వాటర్ జెట్స్‌ను కూడా తట్టుకునే స్థాయి వీటికి ఉంటుంది. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో ఇలాంటి ప్రొటెక్షన్ చాలా అరుదు. 50MP Sony LYT-600 మెయిన్ సెన్సర్ (OISతో)తో ఈ ఫోన్స్ రానున్నాయి. 16MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఆక్సిజన్‌ ఓఎస్‌తో లాంచ్ అవుతుందని అంచనా. ఇప్పటివరకు వన్‌ప్లస్ నార్డ్‌ 6 సిరీస్‌పై అధికారికంగా ఎలాంటి డీటెయిల్స్ లేవు. త్వరలో ఫుల్ డీటెయిల్స్ తెలియరానున్నాయి.

Exit mobile version