IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!

  • వన్‌ప్లస్ ఏస్ 7 స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అధికారికంగా విడుదల
  • 6.78 అంగుళాల 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్‌ప్లే
  • డిస్‌ప్లే 185Hz వరకు రిఫ్రెష్ రేట్‌
  • Snapdragon 8 Elite Gen 5 V Series చిప్‌సెట్‌
  • వెనుక భాగంలో OIS సపోర్ట్‌తో 200MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా
  • 9000mAh గ్లేసియర్ బ్యాటరీతో పాటు 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్
  • గేమింగ్ సమయంలో వేడిని నియంత్రించేందుకు డ్యూయల్-ఛానల్ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్‌..
Oneplus Ace 7

Oneplus Ace 7

OnePlus Ace 7: వన్‌ప్లస్ నుండి పెర్ఫార్మెన్స్ ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ OnePlus Ace 7ను చైనాలో అధికారికంగా విడుదల అయ్యింది. గేమింగ్, హై-పెర్ఫార్మెన్స్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు. 185Hz వరకు రిఫ్రెష్ రేట్, Snapdragon 8 Elite Gen 5 V Series చిప్‌సెట్, 9000mAh భారీ బ్యాటరీ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. ఈ మొబైల్ తో పాటు ఈ సిరీస్ లో OnePlus Ace 7 Pro కూడా లాంచ్ అయ్యింది.

185Hz డిస్‌ప్లే & ప్రాసెసర్

OnePlus Ace 7లో 6.78 అంగుళాల 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్‌ప్లేను అందించారు. ఇది 2772×1272 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. సాధారణ వినియోగంలో 1Hz నుంచి 165Hz వరకు డైనమిక్ రిఫ్రెష్ రేట్‌ను అందించగా, సపోర్ట్ చేసే గేమ్స్‌లో 185Hz వరకు రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. 2000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్‌లో 3nm టెక్నాలజీ ఆధారిత Snapdragon 8 Elite Gen 5 V సిరీస్ మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. దీనికి Adreno 840 GPU జత చేశారు. 12GB, 16GB LPDDR5X RAM ఆప్షన్లతో పాటు 256GB, 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. గేమింగ్ సమయంలో వేడిని నియంత్రించేందుకు డ్యూయల్-ఛానల్ “ఐస్ రివర్” యాక్టివ్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. ఈ కూలింగ్ వ్యవస్థ ద్వారా గేమింగ్ సమయంలో చిప్‌సెట్ ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే టచ్ ల్యాగ్ తగ్గించేందుకు T3 టచ్ చిప్, మెరుగైన మోషన్ కంట్రోల్ కోసం 800Hz గైరోస్కోప్, నెట్‌వర్క్ పనితీరును మెరుగుపరిచేందుకు G3 నెట్‌వర్క్ చిప్, ఫ్రేమ్ స్టెబిలిటీ కోసం P4 డిస్‌ప్లే చిప్‌ను ఇందులో ఇచ్చారు.

200MP కెమెరా & 9000mAh బ్యాటరీ

ఫొటోగ్రఫీ కోసం ఈ మొబైల్లో 200MP మెయిన్ కెమెరాను అందించారు. దీనికి OIS సపోర్ట్ ఉంది. అలాగే 8MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను అందించారు. వెనుక కెమెరాతో 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఇందులో ప్రధానంగా 9000mAh కెపాసిటీ కలిగిన “గ్లేసియర్” బ్యాటరీ ఉంది. దీనికి 100W SuperVOOC వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. పవర్ బైపాస్ టెక్నాలజీ కారణంగా గేమింగ్ వంటి భారీ పనుల సమయంలో ఛార్జర్ నుంచి నేరుగా పవర్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాటరీపై వేడి, ఒత్తిడి తగ్గుతాయి. ఇంకా ఫోన్‌లో మెటల్ మిడిల్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ లభించాయి. ఆండ్రాయిడ్ 17 ఆధారిత ColorOS 17తో ఫోన్ పనిచేస్తుంది. 5G, Wi-Fi 7, Bluetooth 5.4, NFC వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ధర

చైనాలో OnePlus Ace 7 మొబైల్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 4,399 యువాన్లు (USD 660 / రూ.62,855)గా ఉంది. 16GB + 256GB వేరియంట్ 4,899 యువాన్లు (USD 735 / రూ.70,000) కాగా, 12GB + 512GB వేరియంట్ 5,199 యువాన్లు (USD 780 / రూ.74,290), 16GB + 512GB వేరియంట్ 5,699 యువాన్లు (USD 855 / రూ.81,430)గా నిర్ణయించారు. ఈ ఫోన్ అమ్మకాలు ఇప్పటికే చైనాలో అందుబాటులోకి వచ్చింది.