Site icon NTV Telugu

OnePlus 15R Launch: 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. స్పెషల్ స్పెసిఫికేషన్లతో వస్తున్న వన్‌ప్లస్‌ 15ఆర్!

Oneplus 15r Launch

Oneplus 15r Launch

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్‌’ తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ‘వన్‌ప్లస్‌ 15’ను ఇటీవల ఇండియాలో లాంచ్‌ చేసింది. చైనా వేరియెంట్‌లోని ఫీచర్లనే దాదాపుగా భారత్‌లో లాంచ్ అయిన ఫోన్‌లో ఉన్నాయి. వన్‌ప్లస్‌ మరో ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్దమైంది. భారతదేశంలో ‘OnePlus 15R’ లాంచ్ తేదీని ప్రకటించింది. డిసెంబర్ 17న కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ఈ ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయిన OnePlus Ace 6T రీబ్రాండెడ్ వెర్షన్.

వన్‌ప్లస్‌ 15ఆర్ స్మార్ట్‌ఫోన్‌లో వన్‌ప్లస్‌ ఏస్ 6టీలో ఉన్న ఫీచర్లే దాదాపుగా ఉండనున్నాయి. 165Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో 6.7-అంగుళాల 1.5K రిజల్యూషన్ OLED డిస్‌ప్లేను కలిగి ఉండనుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటాయి. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను అందించవచ్చు.

Also Read: T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌లో 55 మ్యాచ్‌లు.. ఫార్మాట్‌ ఇదే! భారత్‌కు ఈజీయేనా

వన్‌ప్లస్‌ 15ఆర్ స్మార్ట్‌ఫోన్‌ IP68, IP69, IP69K రేటింగ్‌లతో వస్తుంది. ఇది వేపర్ చాంబర్ కూలింగ్‌ను కలిగి ఉంటుంది. కలర్ OS 16తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌ను కలిగి ఉండనుంది. 8000mAh బ్యాటరీతో రానుంది. ఇంత పెద్ద బ్యాటరీ వన్‌ప్లస్‌ నుంచి వచ్చిన ఏ ఫోన్‌లోనూ లేదు. 100W ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వనుంది. ఈ ఫోన్‌ను రూ.50,000 లోపు లాంచ్ చేసే అవకాశం ఉంది. డిసెంబర్ 17న అన్ని డీటెయిల్స్ తెలియరానున్నాయి.

Exit mobile version