Site icon NTV Telugu

OLA Electric Car: వచ్చేస్తోంది ఓలా కారు.. అదిరిపోయే ఫీచర్స్..!

Ola Electric Car

Ola Electric Car

ఇప్పుడు అందరి చూపు ఎలక్ట్రిక్​ వాహనాలవైపు మళ్లింది.. వరుసగా పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్‌ ధరలతో ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే, అక్కడక్కడ కొన్ని వాహనాల్లో బ్యాట్రీలు పేలిపోయి.. వాహనాలు తగలబడిన ఘటనలు కొంత ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి.. ఇక, త్వరలోనే భారత మార్కెట్‌లోకి ఓలా ఎలక్ట్రిక్‌ కార్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి… ఒక్కసారి ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్ల ప్రయాణం.. 4 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సత్తా కలిగి ఉందని.. ఇక, స్పోర్టీ లుక్​.. ఆల్​ గ్లాస్​ రూఫ్.. కీ లెస్.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని వెల్లడించారు ఆ సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ ‘మిషన్ ఎలక్ట్రిక్ 2022’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఓలా ఎలక్ట్రిక్​ ప్లాన్లను ప్రకటించారు.

Read Also: Revanth Reddy: 20న మునుగోడుకి వస్తున్నా.. మన ప్రభుత్వం వచ్చేముందు తప్పటడుగులు వద్దు..!

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన కొత్త ఈవీ కారు 2024లో వస్తుందని, 500 కిమీల రేంజ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇది S1 స్కూటర్‌తో పాటు కొత్త బ్యాటరీని కూడా ప్రకటించింది. ఓలా సీఈవో మరియు కోఫౌండర్ భవిష్ అగర్వాల్.. భారతదేశంలో ఈవీ విప్లవాన్ని తీసుకురావడం గురించి మాట్లాడుతూ.. కంపెనీకి చెందిన ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ భవిష్యత్తులో ఒక మిలియన్ ఈవీ కార్లను ఉత్పత్తి చేయగలదని పేర్కొన్నారు. అయితే, కొంతకాలంగా ఈవీ కారు ప్రకటనను పోస్ట్‌ చేస్తూ వస్తున్నారు అగర్వాల్.. మొత్తంగా ఇవాళ ఆ కారు ప్రత్యేకతలను పంచుకున్నారు.. అయితే కొత్త ఈవీ కారు రావడానికి కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. ఇక, ఓలా ఇప్పటికే మార్కెట్‌లో ఈవీ స్కూటర్‌లను కలిగి ఉంది.. కానీ, గత కొన్ని నెలలుగా ఈ ఉత్పత్తులల్లో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ కారు, అగర్వాల్ ప్రకారం, భవిష్యత్తులో కనిపించే డిజైన్‌ను కలిగి ఉంటుంది మరియు పరిమాణం చిన్న హ్యాచ్‌బ్యాక్‌ను పోలి ఉంటుందని భావిస్తున్నారు. అగర్వాల్ జనవరిలో కారు కోసం డిజైన్‌ను ట్వీట్ చేశారు మరియు డిజైన్ అలాగే ఉంటుందో లేదో వేచి చూడాలి.

Exit mobile version