NVIDIA CEO Jensen Huang: ఈసారి మంచి సీఈఓగా ఉంటా.. కౌగిలించుకున్న మహిళా ఉద్యోగి.. భావోద్వేగానికి గురైన జెన్సన్ హువాంగ్!

Nvidia Ceo Jensen Huang

Nvidia Ceo Jensen Huang

NVIDIA CEO Jensen Huang: అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా (NVIDIA) సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు కంపెనీ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారా ప్రధాన కార్యాలయానికి ఆయన తిరిగి రావడంతో ఉద్యోగులంతా చప్పట్లతో, నినాదాలతో స్వాగతించారు. కొందరు ఉద్యోగులు ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తనకు మరో అవకాశం ఇచ్చిన ఉద్యోగులకు జెన్సన్ హువాంగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి మరింత మెరుగైన సీఈఓగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. “నాకు రెండో అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈసారి నేను మరింత మెరుగైన సీఈఓగా ఉంటాను” అని ఆయన తన గుండెపై చేయి వేసుకుని భావోద్వేగంగా చెప్పారు. దీంతో ఉద్యోగులంతా “మేము నిన్ను ప్రేమిస్తున్నాం జెన్సన్!” అంటూ నినాదాలు చేశారు. మరికొందరు “ఇక పని ప్రారంభిద్దాం!” అని ఉత్సాహంగా అన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులంతా కలిసి “జెన్సన్! జెన్సన్! జెన్సన్!” అంటూ కార్యాలయాన్ని మారుమోగించారు. అనంతరం ఉద్యోగులను నవ్విస్తూ.. “ధన్యవాదాలు. ఈరోజు నా మొదటి రోజు. నా దగ్గర కంప్యూటర్ లేదు. కాబట్టి ఐటీ విభాగం నాకు కొత్త పీసీ ఇవ్వాలి” అని సరదాగా వ్యాఖ్యానించారు.

ఉద్యోగులకు క్షమాపణలు.. కౌగిలించుకున్న మహిళా ఉద్యోగి

మరో వీడియోలో జెన్సన్ హువాంగ్ ఉద్యోగులకు క్షమాపణలు చెబుతూ కనిపించారు. తన వల్ల ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నందుకు విచారం వ్యక్తం చేశారు. “మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ పరిస్థితులన్నింటి ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నిజంగా క్షమించండి. నేను కొన్ని తీవ్రమైన తప్పులు చేశాను. వాటి నుంచి బయటపడి తిరిగి మంచి స్థాయికి రావడానికి కృషి చేస్తాను” అని ఆయన పేర్కొన్నారు. ఆయన మాట్లాడిన కొద్దిసేపటికే ఓ మహిళా ఉద్యోగి పరుగెత్తుకుంటూ వచ్చి జెన్సన్‌ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. దీంతో అక్కడున్న ఉద్యోగులంతా ఆనందంతో కేరింతలు కొట్టారు.

సోమవారం ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు కీలక ప్రకటన చేసింది. జెన్సన్ హువాంగ్‌ను తక్షణమే కంపెనీ అధ్యక్షుడిగా (President), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)గా, అలాగే బోర్డు సభ్యుడిగా తిరిగి నియమించినట్లు వెల్లడించింది. బోర్డు సభ్యులు ఆయనతో వరుసగా చర్చలు, సమావేశాలు నిర్వహించిన అనంతరం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన నిజాయితీగా వ్యవహరించిన తీరు, కంపెనీని నడిపించే నాయకత్వ సామర్థ్యంపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది.