Nubia Z80 Ultra: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నుబియా (nubia) ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Z80 Ultraను అధికారికంగా చైనాలో లాంచ్ చేసింది. గత సంవత్సరం విడుదలైన Z70 Ultraకి అప్డేటెడ్ గా వచ్చిన ఈ ఫోన్ డిస్‌ప్లే, పనితీరు, కెమెరా, బ్యాటరీ వంటి అన్ని విభాగాల్లో భారీ అప్‌గ్రేడ్‌లతో లాంచ్ అయ్యింది. ఈ Z80 Ultraలో 6.85 అంగుళాల 1.5K OLED X10 డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 960Hz టచ్ సాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. “AI Twilight Eye Protection” అనే ఫీచర్ ద్వారా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల ఆధారంగా స్క్రీన్ కలర్ టెంపరేచర్ ఆటోమేటిక్‌గా మారుతుంది. అలాగే ఈ ఫోన్‌లో DTS:X Ultra సపోర్ట్‌తో బాక్స్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.
ఈ ఫోన్‌కి పవర్‌ఫుల్ Snapdragon 8 Elite Gen 5 (3nm) ప్రాసెసర్‌ను అందించారు. ఇది Adreno 840 GPUతో వస్తుంది. ఈ కొత్త Z80 Ultraలో గరిష్టంగా 24GB LPDDR5X ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజ్ లభిస్తుంది. ఇందులో హీట్ డిసిపేషన్ కోసం రెడ్‌మ్యాజిక్ గేమింగ్ ఫోన్‌ల మాదిరిగా లిక్విడ్ మెటల్ కూలింగ్ సిస్టమ్ ను వాడారు. ఇది చిప్ ఉష్ణోగ్రతను 5°C వరకు తగ్గించనుంది. గేమర్స్ కోసం ప్రత్యేకంగా 140+ గేమ్ అసిస్టెంట్ ఫీచర్లు కలిగిన Game Space కూడా ఇందులో అందించారు.
Bengaluru Shocking: ఇంట్లో లివ్-ఇన్ జంట మృతి! దర్యాప్తులో ఏం తేలిందంటే..!
ఇక Z80 Ultraలో ప్రధానంగా 50MP ఓమ్ని విజన్ లైట్ మాస్టర్ 990 సెన్సార్ (1/1.3″, f/1.5, OIS) ఉంది. అలాగే 50MP (1/1.55″, f/1.8) అల్ట్రా-వైడ్ లెన్స్, 64MP (1/2″, f/2.48, OIS) పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇక మొబైల్ ముందు భాగంలో 16MP అండర్ డిస్‌ప్లే కెమెరా ఉంది. ఇక ఫోటోగ్రఫీకి సహాయపడే “AI Photography Master” ఫీచర్ ద్వారా వాయిస్ గైడెన్స్ కూడా అందిస్తుంది. ఇది యాంగిల్, లైటింగ్ సూచనలు ఇచ్చి ప్రొఫెషనల్ ఫోటోలను తీసేలా చేస్తుంది. ఇందులో ప్రత్యేకంగా ఒక Professional Photography కిట్ ను కూడా పరిచయం చేసింది. ఇది నానో లెదర్ మెటీరియల్, టైటానియం కలర్ అల్యూమినియం ఫ్రేమ్‌తో తయారైంది.
ఈ కొత్త Z80 Ultraలో భారీ 7200mAh బ్యాటరీ ఉంది. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 80W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే వైర్‌లెస్ రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా అందించారు. ఈ ఫోన్ ఫంటం బ్లాక్, కండెన్స్డ్ లైట్ వైట్, స్టార్రి నైట్ కలెక్టర్స్ ఎడిషన్ అనే మూడు ప్రధాన కలర్స్‌లో లభిస్తుంది. వీటితోపాటు ప్రత్యేకమైన Luo Tianyi Limited Edition కూడా ఉంది. ఇది చైనా రెడ్ కలర్ స్కీమ్‌తో “Jinyiwei” థీమ్‌లో డిజైన్ చేయబడింది. ఈ వెర్షన్‌లో ప్రత్యేక వాల్‌పేపర్స్, బూట్ యానిమేషన్స్, ఫింగర్‌ప్రింట్ అనిమేషన్స్, ఎక్స్‌క్లూజివ్ కెమెరా వాటర్‌మార్క్స్ ఉంటాయి.
Kakinada: 8వ తరగతి బాలికను తోటలోకి తీసుకెళ్లిన టీడీపీ నేత.. కౌన్సిలర్నంటూ బెదిరింపులు..
నూబియా Z80 అల్ట్రా వివిధ స్టోరేజ్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. బేస్ వెర్షన్ అయిన 12GB + 512GB మోడల్ ధర 4999 యువాన్స్ (రూ.61,630). దాని తర్వాతి వేరియంట్ 16GB + 512GB ధర 5299 యువాన్స్ (రూ.65,325). ఇక ప్రత్యేక డిజైన్ కలిగిన Starry Night Edition 16GB + 512GB ధర 5599 యువాన్స్ (రూ.69,020). మరింత స్టోరేజ్ కోరుకునే వారికి 16GB + 1TB వేరియంట్ 5699 యువాన్స్ (రూ.70,255) ధరలో లభిస్తుంది. ప్రత్యేకమైన Luo Tianyi Limited Edition 16GB + 512GB వెర్షన్ ధర 5799 యువాన్స్ (రూ.71,485) కాగా, అత్యంత ప్రీమియం Starry Night Edition 16GB + 1TB వేరియంట్ ధర 5999 యువాన్స్ (రూ.73,950)గా నిర్ణయించారు. ఇక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కిట్‌ను వేరుగా కొనుగోలు చేయవచ్చు. దీని ధర 669 యువాన్స్ (రూ.8,245)గా ఉంది.
