Nothing Phone (4b): 6000mAh బ్యాటరీతో.. నథింగ్ ఫోన్ (4బి) భారత్‌లో విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
- నథింగ్ ఫోన్ (4బి) భారత్‌లో విడుదల
- 8GB RAM + 128GB స్టోరేజ్: రూ.34,999
- 6000mAh బ్యాటరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nothing Phone (4b) India Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రత్యేకమైన ట్రాన్స్పరెంట్ (Transparent Glyph) డిజైన్‌తో గుర్తింపు తెచ్చుకున్న నథింగ్ (Nothing) సంస్థ భారత మార్కెట్లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. Nothing Phone (4b) పేరుతో విడుదలైన ఈ ఫోన్ మిడ్-రేంజ్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చింది. ఆకర్షణీయమైన గ్లిఫ్ డిజైన్‌తో పాటు 6000mAh భారీ బ్యాటరీ, Qualcomm Snapdragon 6 Gen 4 ప్రాసెసర్, 120Hz AMOLED డిస్ప్లే వంటి ఫీచర్లను ఈ ఫోన్లో అందించింది.
భారత్‌లో నథింగ్ ఫోన్ (4బి) ధర
Nothing Phone (4a), Phone (4a) Pro తర్వాత 2026లో కంపెనీ విడుదల చేసిన మూడో ప్రధాన స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
Also Read
- Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
- Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్‌టాప్‌లు భారత్‌లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్ప్లే
8GB RAM + 128GB స్టోరేజ్: రూ.34,999
8GB RAM + 256GB స్టోరేజ్: రూ.38,999
ప్రారంభ ఆఫర్ ధరలు
8GB + 128GB: రూ.29,999
8GB + 256GB: రూ.33,699
ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్, బ్లూ రంగుల్లో లభిస్తుంది. బెంగళూరులోని నథింగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లో ప్రత్యేక RCB Edition కూడా అందుబాటులో ఉంటుంది.
తొలి సేల్ ఎప్పుడు?
Nothing Phone (4b) తొలి విక్రయాలు జూలై 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్‌ను Flipkart, Croma, Reliance Digital, Vijay Salesతో పాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
Nothing Phone (4b) డిస్ప్లే
ఫోన్లో 6.77 అంగుళాల Full HD+ Super AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కు మద్దతు ఇస్తుంది. గరిష్టంగా 2,000 నిట్స్ బ్రైట్నెస్ అందించడం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. డిస్ప్లేకు AGC DT Star 2 Glass రక్షణ ఉండగా, ఫోన్‌కు IP64 రేటింగ్ కూడా లభించింది. దీంతో దుమ్ము, నీటి చినుకుల నుంచి కొంతవరకు రక్షణ లభిస్తుంది.
పనితీరు
Nothing Phone (4b)లో Qualcomm Snapdragon 6 Gen 4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇందులో 8GB RAM, 256GB వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ Android 16 ఆధారిత Nothing OS 4.1పై పనిచేస్తుంది. కంపెనీ మూడు సంవత్సరాల Android OS అప్డేట్లు, అలాగే భద్రతా అప్డేట్లను అందిస్తామని హామీ ఇచ్చింది.
కెమెరా
ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను అందించారు. 50MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో), 8MP అల్ట్రా వైడ్ కెమెరా, అదనపు సెన్సార్ ముందువైపు 16MP సెల్ఫీ కెమెరా ఉండటంతో సెల్ఫీలు, వీడియో కాల్స్ మంచి నాణ్యతతో పొందవచ్చు.
భారీ 6000mAh బ్యాటరీ
ఈ ఫోన్లో 6000mAh బ్యాటరీను అందించారు. రోజంతా బ్యాటరీ బ్యాకప్ అందేలా రూపొందించిన ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.
మిడ్-రేంజ్ విభాగంలో పోటీని మరింత పెంచేలా Nothing Phone (4b)ను కంపెనీ తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన ట్రాన్స్పరెంట్ డిజైన్, 6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 4 చిప్సెట్, 120Hz AMOLED డిస్ప్లే, Android 16 వంటి ఫీచర్లతో ఈ ఫోన్ యూజర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రారంభ ఆఫర్ ధరలో అందుబాటులో ఉండటం వల్ల మీడియం రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలవొచ్చు.
- Tags
- india
- Nothing
- Nothing Phone 4b
తాజావార్తలు
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!