Nothing Ear 3: నథింగ్ (Nothing) కంపెనీ తమ కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ నథింగ్ ఇయర్ 3 (Nothing Ear 3)ను కొన్ని అంతర్జాతీయ మార్కెట్‌లలో లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ ఛార్జింగ్ కేస్‌లో “సూపర్ మైక్” అనే వినూత్న ఫీచర్‌తో వస్తుంది. ఇది 95dB వరకు శబ్దాన్ని తగ్గించి స్పష్టమైన వాయిస్ కాల్స్‌కు సహాయపడుతుంది. కేస్‌పై ఉన్న ‘టాక్’ బటన్ నొక్కి దీనిని వెంటనే ఉపయోగించుకోవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌తో కేస్ నుంచే వాయిస్ నోట్స్ రికార్డ్ చేయవచ్చు. అవి నథింగ్ ఓఎస్ ఉన్న ఫోన్‌లలో ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌క్రైబ్ అయ్యి టెక్స్ట్‌గా మారుతాయి. ఈ TWS ఇయర్‌ఫోన్‌లు 45dB వరకు రియల్ టైమ్ అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ను సపోర్ట్ చేస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 38 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయని కంపెనీ పేర్కొంది.
నథింగ్ ఎర్ 3 స్పెసిఫికేషన్స్, ఫీచర్లు:
వాయిస్ & మైక్:
ప్రతి ఇయర్‌బడ్‌లో మూడు మైక్రోఫోన్‌లు, ఒక బోన్ కండక్షన్ వాయిస్ పికప్ యూనిట్ ఉన్నాయి. ఇవి AI నాయిస్ క్యాన్సిలేషన్ గాలి శబ్దాన్ని 25dB వరకు తగ్గిస్తుంది.
నాయిస్ క్యాన్సిలేషన్:
రియల్-టైమ్ అడాప్టివ్ ANC 45dB వరకు శబ్దాన్ని నిరోధించగలదు. ఇది ప్రతి 600 మిల్లీసెకన్లకు పర్యావరణానికి అనుగుణంగా సర్దుబాటు అవుతుంది.
Coffee: కాఫీ ప్రియులకు అలర్ట్.. మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుందా?
ఆడియో:
వీటిలో అప్‌గ్రేడ్ చేసిన 12mm డైనమిక్ డ్రైవర్లు ఉన్నాయి. ఇవి బాస్, ట్రెబుల్ రెండింటినీ 4-6dB వరకు పెంచుతాయి.
కనెక్టివిటీ:
ఈ కొత్త నథింగ్ ఎర్ 3 బ్లూటూత్ 5.4, హై రెజల్యూషన్ ఆడియో కోసం LDAC సపోర్ట్ చేస్తుంది. గేమింగ్, వీడియో కోసం 120ms కంటే తక్కువ లేటెన్సీని అందిస్తాయి.
బ్యాటరీ:
ఒక్కో ఇయర్‌బడ్‌లో 55mAh బ్యాటరీ ఉంది. ఇది ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం ప్లేబ్యాక్ సమయం 38 గంటల వరకు ఉంటుంది. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 10 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
AP Assembly : జీఎస్టీ సంస్కరణలతో ప్రతి ఒక్కరికి లాభం జరుగుతుందని ఘంటాపథంగా చెప్తున్న సీఎం చంద్రబాబు
డిజైన్:
ఇందులో ముఖ్యంగా చెప్పుకొనే పారదర్శక కేసింగ్, మెటల్ యాక్సెంట్స్ లను కొనదగిస్తుంది. కేస్ 100% రీసైకిల్ చేసిన అల్యూమినియంతో తయారు చేయబడింది. ఇయర్‌బడ్స్, కేస్ రెండూ IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి.
ధర:
నథింగ్ ఎర్ 3 ధర GBP 179 (రూ. 21,500), యూరోపియన్ మార్కెట్‌లలో EUR 179 (రూ. 18,700), అమెరికాలో 179 డాలర్స్ (సుమారు రూ. 16,000)గా ఉంది. ఇవి బ్లాక్, వైట్ రంగులలో లభిస్తాయి. సెప్టెంబర్ 18 నుండి నథింగ్ వెబ్‌సైట్, ఎంపిక చేసిన స్టోర్స్‌లో గ్లోబల్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 25 నుండి విక్రయాలు మొదలవుతాయి. ఈ టీడబ్ల్యూఎస్ హెడ్‌సెట్ త్వరలో భారతదేశంలో కూడా విడుదల కానుంది. అయితే దీని ధర, విడుదల తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
