NTV Telugu Site icon

Google Grammar Check: ఇకపై గ్రామర్‌ తప్పులకు చెక్‌.. గూగుల్‌లో ప్రత్యేక ఫీచర్‌

Google

Google

Google Grammar Check: మనం ఒక ప్రాంతం నుంచి కొత్త ప్రాంతానికి వెళ్లాలంటే.. ఆ ప్రాంతం మనకు తెలియకపోయినా మన స్మార్ట్ ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్స్ ఆన్‌ చేసుకొని ఆ ప్రాంతానికి వెళతాం. ఇక చదువకునే విద్యార్థులు.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులు తమకు తెలియని విషయాన్ని తెలుసుకోవడం కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి తెలుసుకుంటారు. ఇక ఇంగ్లీష్‌లో అయితే మనకు తెలియని పదం నుంచి.. తెలియని విషయాల వరకు సెర్చ్ చేసి తెలుసుకుంటాం. మనకు ఏది తెలియకపోయినా.. వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. ఇలా ప్రతిదానికి గూగుల్‌పై ఆధారపడుతున్నాము. గూగుల్‌ కూడా కొత్త కొత్త ఫీచర్లను కనిపెడుతూ వినియోగదారులకు దగ్గరవుతోంది. ఇప్పుడు కొత్తగా మరో ఫీచర్‌ను సైతం కనిపెట్టింది. అదేమిటంటే ఇంగ్లీష్‌లో మనం చేసే గ్రామర్‌ మిస్టేక్‌లను మనమే సరి చేసుకోవడం. అదీ గూగుల్‌ సెర్చ్ ద్వారా.. అదెలా అంటే..

Read also: Rajinikanth: అతను నీలాంబరి ముందు నరసింహా పరువు తీశాడు..

ఇంగ్లీషులో గ్రామర్ మిస్టేక్స్ చేసేవారు గణనీయంగా ఉంటారు. ఇంగ్లీష్‌ పాఠాలు బోధించే అధ్యాపకులు సైతం అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటారు. ఇంగ్లీష్‌ గ్రామర్‌లో తప్పులు చేసే వారి సంఖ్య భారీగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటి నుంచి రిలీప్‌ పొందడానికి ఇప్పుడు టెక్ దిగ్గజం గూగుల్ దీని కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. గూగుల్ తన గూగుల్ సెర్చ్‌లో వినియోగదారుల కోసం ‘గ్రామర్ చెక్ ఫీచర్’ను కొత్తగా తీసుకువచ్చింది. అయితే ఇది ప్రస్తుతం ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఇతర భాషలకు అందుబాటులో ఉండనుందని గూగుల్‌ ప్రకటించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫీచర్ ద్వారా ఒక వాక్యం గ్రామర్ పరంగా సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
ఈ ఫీచర్ ద్వారా నేరుగా మనం రాసిన గ్రామర్ చెక్ చేసుకోవచ్చు. అందులో వాక్యాలు సరిగ్గా ఉన్నాయా? లేదా? అని చెక్ చేసుకోవడానికి ఇకపై థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. ఈ కొత్త ఫీచర్ ఉపయోగించడంతో చాలా సులభంగా గ్రామర్‌ చెక్‌ చేసుకోవచ్చు. అయితే ప్రతి సారీ గ్రామర్ చెక్ కోసం పేజ్‌ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.. దానిని ఉపయోగిస్తున్నప్పుడు గ్రామర్ చెక్ అనే టూల్ పాప్ అప్ అవుతుంది. దాని ద్వారా మీరు ఒక వాక్యం ఎంటర్ చేయగానే అందులో గ్రీన్ చెక్ మార్క్ చూపిస్తుంది.. అందులో ఏదైనా తప్పు ఉంటే వెంటనే రెడ్ మార్క్ చూపిస్తుంది. ఇందులో గ్రామర్ మాత్రమే కాకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేస్తుంది ఈ ఫీచర్‌. గూగుల్‌ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ కంప్యూటర్లతోపాటు స్మార్ట్‌ఫోన్లలోనూ ఉపయోగింకునే వీలుంది.