NTV Telugu Site icon

Vivo T3 Lite 5G Launch : వివో నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. ఫీచర్స్, ధర?

Vivooo (4)

Vivooo (4)

ప్రముఖ మొబైల్ కంపెనీ వివో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్ లో వదులుతుంది.. అందులో ఈ మధ్య వస్తున్నా మొబైల్స్ యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.. సరికొత్త ఫీచర్స్ తో అదిరిపోయే లుక్ లో వస్తున్నాయి.. వివో నుంచి వస్తున్న ప్రతి మొబైల్ కు మార్కెట్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.. తాజాగా మరో కొత్త మొబైల్ మార్కెట్ లోకి వచ్చేసింది.. ఆ మొబైల్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

తాజాగా వివో టీ3 లైట్ 5జీ ఫోన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది.. వివో టీ3 లైట్ 5జీ ఫోన్ లైటనింగ్ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. భారత్ అత్యంత సరసమైన డ్యూయల్ 5జీ స్మార్ట్‌ ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సోనీ ఏఐ కెమెరా కూడా ఉంటుంది.. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఫీచర్స్ విషయానికొస్తే.. T3 లైట్ 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. ఈ చిప్‌సెట్ బడ్జెట్ సెగ్మెంట్‌లోని రియల్‌మి నార్జో ఎన్ 65, రియల్‌మి సి65 5 జీ వంటి ఇతర స్మార్ట్‌ ఫోన్‌లకు కూడా పవర్ అందిస్తుంది. కెమెరా విషయానికొస్తే.. 50 ఎంపీ ఏఐ కెమెరాను కలిగి ఉందని తెలుస్తుంది.. అలాగే సెకండరీ సెన్సార్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో వివో అత్యంత సరసమైన 5జీ ఆఫర్ కావచ్చు.. అంతేకాదు కెమెరా స్పెసిఫికేషన్‌లు ఒక రోజు తర్వాత త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.. ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. 12వేల లోపు ఉండవచ్చు. జూన్ చివరి నాటికి భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది..