Site icon NTV Telugu

Motorola Signature Launch: 5200 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా.. ప్రీమియం లుక్‌తో వచ్చేసిన మోటో సిగ్నేచర్‌!

Motorola Signature Launch

Motorola Signature Launch

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ‘మోటోరొలా’ సిగ్నేచర్‌ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. మోటోరొలా సిగ్నేచర్‌ (Motorola Signature) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఇటీవలే లాస్‌వేగాస్‌లో జరిగిన CES 2026లో లాంచ్ అయిన ఈ డివైస్‌.. డిజైన్‌, హార్డ్‌వేర్‌, కెమెరా ఫీచర్ల పరంగా హైఎండ్‌ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత వేరియెంట్‌కు మెరుగైన హార్డ్‌వేర్‌ ఇవ్వడం ఇక్కడ విశేషం. మోటోరొలా సిగ్నేచర్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర, ఫీచర్లు, ఇతర డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

భారత్‌లో మోటోరొలా సిగ్నేచర్‌ 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.59,999గా కంపెనీ నిర్ణయించింది. 16జీబీ+512జీబీ వేరియంట్‌ ధర రూ.64,999గా ఉండగా.. టాప్‌ ఎండ్‌ 16జీబీ+1టీబీ వేరియెంట్‌ ధర రూ.69,999గా ఉంది. ఈ ఫోన్‌ జనవరి 30 నుంచి భారత మార్కెట్‌లో అన్ని ప్రధాన ప్లాట్‌ఫాంలలో అందుబాటులోకి రానుంది. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేస్తే.. రూ.5 వేలు డిస్కౌంట్‌ పొందొచ్చు. లేదా ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌ రూ.5 వేలు లభిస్తుంది.

మోటరోలా సిగ్నేచర్‌లో 6.8 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. ఇది 165Hz రిఫ్రెష్‌ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 6200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంది. స్క్రీన్‌ రక్షణ కోసం కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 అందించారు. కేవలం 6.99mm మందం, 186 గ్రాముల బరువుతో స్లీక్‌ డిజైన్‌లో కనిపించే ఈ ఫోన్‌కు IP68 + IP69 రేటింగ్స్, అలాగే MIL-STD మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ ఉండటం విశేషం. ఇందులో ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జన్‌ 5 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 16తో అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ ఉంది. గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్ల తరహాలోనే 7 సంవత్సరాల సాఫ్ట్‌వేర్‌, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని మోటరోలా తెలిపింది.

Also Read: Ustaad Bhagat Singh: ముందుకొచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్.. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్!

ఈ డివైస్‌ వెనుక భాగంలో ట్రిపుల్‌ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 50MP సోనీ మెయిన్‌ కెమెరా, 50MP శాంసంగ్ అల్ట్రావైడ్‌ లెన్స్, అలాగే 50MP 3x పెరిస్కోప్‌ టెలిఫోటో సోనీ లెన్స్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ప్రియులను దృష్టిలో పెట్టుకుని కెమెరా విభాగంలో భారీ అప్‌గ్రేడ్‌ ఇచ్చారు. ఈ ఫోన్‌లో 5,200mAh బ్యాటరీ ఉంది. ఇది 90W ఫాస్ట్‌ వైర్డ్‌ చార్జింగ్, 50W వైర్‌లెస్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. చార్జర్‌ను కూడా బాక్స్‌లోనే అందించడం వినియోగదారులకు అదనపు ప్లస్‌ పాయింట్‌. మొత్తంగా చూస్తే మోటరోలా సిగ్నేచర్‌ సిరీస్‌ ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. డిజైన్‌, డిస్‌ప్లే, కెమెరా, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ అన్నింటిలోనూ హైఎండ్‌ యూజర్లకు బెస్ట్ ఆప్షన్. వినియోగదారులను ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.

Exit mobile version